ఎన్టీఆర్-కొరటాల శివ మూవీపై క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ భారీగా ఉండనున్నట్లు సమాచారం అందుతుంది.
దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) నెక్స్ట్ ఎన్టీఆర్ తో మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఏడాదే సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. కొరటాల ఆచార్య మూవీ పూర్తి చేసే పనిలో బిజీగా ఉండగా, ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ కోసం లాక్ అయ్యారు. ఈ రెండు ప్రాజెక్ట్స్ అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. కరోనా పరిస్థితుల కారణం లేటయ్యాయి. దీంతో ఎన్టీఆర్, కొరటాల మూవీ లేట్ అవుతుంది.
ఆచార్య కోసం కొరటాల, ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)వలన ఎన్టీఆర్ దాదాపు నాలుగేళ్లు కోల్పోయారు. దీంతో వీలైనంత త్వరగా ఎన్టీఆర్ 30 ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా కొరటాల పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. ఇక ఈ మూవీ బడ్జెట్ పై కూడా క్లారిటీ వచ్చింది. ఏకంగా రూ. 300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుందట.
ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ (NTR)కెరీర్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీగా ఇది రికార్డులకు ఎక్కనుంది. ఇక కొరటాల మార్కు సామాజిక సందేశం జోడించి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కొరటాల తెరకెక్కించనున్నారు. ఆర్ ఆర్ ఆర్ తో అనేక రికార్డ్స్ బద్దలు కొట్టిన ఎన్టీఆర్ కొరటాల మూవీతో మరొక మైలురాయికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
గతంలో ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ విడుదలైంది. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. అదే సమయంలో కొరటాల పరిశ్రమలో హిట్ చిత్రాల దర్శకుడిగా రికార్డులకు ఎక్కాడు. ఇంత వరకు కొరటాల కెరీర్ లో ప్లాప్ ఎదురుకాలేదు. ఇక కొరటాల సినిమా తర్వాత ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ మూవీ చేయనున్నారు.
