బాలయ్య-చిరు కలిసి ఉన్న త్రో బ్యాక్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది నెటిజెన్స్ ని ఎంతగానో ఆకర్షించింది. కారణం ఆ ఫొటోలోని చిరంజీవి గెటప్ అండ్ సెటప్.
ప్రముఖుల పాత ఫోటోలు ఎప్పుడూ ప్రత్యేకమే. వాటికి ఆసక్తికరమైన నేపథ్యం ఉంటుంది. చిరంజీవితో బాలయ్య ముచ్చటిస్తున్న త్రో బ్యాక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటో నెటిజెన్స్ ని ఎంతగానో ఆకర్షించింది. దానికి ఒక కారణం ఉంది. ఆ పాత ఫోటోలో చిరంజీవి శోభనం పెళ్ళికొడుకు గెటప్ లో ఉన్నారు. శోభనం గది సెటప్ ఉంది. పూలతో అలంకరించిన పందిరి మంచంపై కూర్చొని బాలకృష్ణ, చిరంజీవి మాట్లాడుకుంటున్నారు. దీంతో చిరంజీవి శోభనం గదిలో బాలయ్య ఏం చేస్తున్నారు? ఈ ఫోటో నేపథ్యం ఏమిటనే? ఆసక్తి పెరిగింది...
ఇక ఆ ఫోటో వివరాలు పరిశీలిస్తే... ఘరానా మొగుడు మూవీలోని శోభనం సీన్ సెట్ ఆది. దర్శకుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఆ చిత్ర ఓపెనింగ్ కి అతిథిగా బాలకృష్ణ హాజరయ్యారు. ఫస్ట్ రోజే రాఘవేంద్రరావు చిరంజీవి, నగ్మా మధ్య శోభనం సీన్ తీయాలని ఆ సెటప్ వేయించాడు. గెస్ట్ గా ఘరానా మొగుడు సినిమా సెట్స్ కి వచ్చిన బాలకృష్ణ శోభనం పెళ్లి కొడుకు గెటప్ లో ఉన్న చిరంజీవితో ఆ గదిలో కూర్చొని మాట్లాడారు. ఆ సమయంలో క్లిక్ మనిపించిన ఫోటో అది.
బాలకృష్ణది లక్కీ హ్యాండ్ అనే సెంటిమెంట్ పరిశ్రమలో ఉంది. చాలా సినిమాలకు బాలయ్య ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టేవాడు. పవన్ కళ్యాణ్ సుస్వాగతం చిత్ర లాంచింగ్ ఈవెంట్ కి హాజరైన బాలకృష్ణ పవన్ పై క్లాప్ కొట్టారు. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఫస్ట్ హిట్ సుస్వాగతం కావడం విశేషం. ఘరానా మొగుడు సైతం భారీ విజయం అందుకుంది. 1992 లో విడుదలైన ఘరానా మొగుడు తెలుగు ప్రేక్షకులను ఊపేసింది. చిరంజీవి మాస్ మేనరిజమ్స్, కీరవాణి సాంగ్స్ సినిమాకు హైలెట్.
అదే ఏడాది బాలకృష్ణ నుండి మూడు సినిమాలు విడుదలయ్యాయి. ధర్మక్షేత్రం, రౌడీ ఇన్స్పెక్టర్, అశ్వమేధం చిత్రాల్లో రౌడీ ఇన్స్పెక్టర్ మంచి విజయాన్ని అందుకుంది. దర్శకుడు బి గోపాల్ తెరకెక్కించిన రౌడీ ఇన్స్పెక్టర్ బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. 1992లో చిరంజీవికి ఘరానా మొగుడు, బాలకృష్ణకు రౌడీ ఇన్స్పెక్టర్ రూపంలో మంచి విజయాలు దక్కాయి.
