కెరీర్ లో మొదటిసారి అవుట్ అండ్ అవుట్ ఎమోషనల్ లవ్ డ్రామాలో నటిస్తున్నారు ప్రభాస్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ప్యూర్ అండ్ సెన్సిబుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుంది. ఇటలీ నేపథ్యంలో నడిచే పీరియాడిక్ డ్రామాగా రాధే శ్యామ్ ఉండనుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ గ్లిమ్ప్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. 


నేడు శివరాత్రి పండగ సంధర్భంగా రాధే శ్యామ్ మూవీ నుండి ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు చిత్ర బృందం. చల్లని మంచులో పడుకొని.. మైమరిచి ప్రేమను ఆస్వాదిస్తున్న ప్రభాస్, పూజా లుక్ ఆకట్టుకుంది. కొందరు దీని పిచ్చి అనుకుంటారు.. కాని ఇది ప్రేమ. ఈ అనంతమైన ప్రేమ మీ హృదయాలలో ఎప్పటికి నిలిచిపోతుంది అంటూ, పోస్టర్ కి చక్కని వివరణ ఇచ్చారు. 


దర్శకుడు రాధే కృష్ణ రాధే శ్యామ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రాధే శ్యామ్ పలు భాషల్లో విడుదల కానుంది. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా.. జులై 30న విడుదల కానుంది. సాహో మూవీ తరువాత ప్రభాస్ నుండి వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలున్నాయి. రాధే శ్యామ్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.