Asianet News TeluguAsianet News Telugu

చిరు చెల్లిగా కీర్తి సురేష్... రక్షాబంధన్ పురస్కరించుకొని భోళా శంకర్ నుండి ఇంట్రెస్టింగ్ పోస్టర్

వేదాళం మూవీలో హీరో చెల్లి పాత్ర చాలా కీలకం. తమిళంలో అజిత్ చెల్లిగా లక్ష్మీ మీనన్ చేశారు. ఇక తెలుగు వర్షన్ భోళా శంకర్ లో చిరు చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. దీనిపై నేడు అధికారిక ప్రకటన వెలువడింది.

a special poster from bhoola shanker on raksha bandhan keerthy turns sister to chiru
Author
Hyderabad, First Published Aug 22, 2021, 1:26 PM IST

మెగా స్టార్ పుట్టినరోజు నాడు ఒక్కొక్కటిగా క్రేజీ అప్డేట్స్ వస్తున్నాయి. లేటెస్ట్ గా దర్శకుడు మెహర్ రమేష్ తో చిరు చేస్తున్న భోళా శంకర్ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ విడుదల  చేశారు. భోళా శంకర్ 2015లో తమిళంలో తెరకెక్కిన వేదాళం కి అధికారిక రీమేక్. అజిత్ హీరోగా దర్శకుడు శివ తెరకెక్కించిన వేదాళం మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మాస్ ఎంటర్టైనర్ ని తెలుగులో చిరుతో మెహర్ రమేష్ తెరకెక్కించనున్నారు. 


కాగా వేదాళం మూవీలో హీరో చెల్లి పాత్ర చాలా కీలకం. తమిళంలో అజిత్ చెల్లిగా లక్ష్మీ మీనన్ చేశారు. ఇక తెలుగు వర్షన్ భోళా శంకర్ లో చిరు చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. దీనిపై నేడు అధికారిక ప్రకటన వెలువడింది. నేడు రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని చిరుకి రాఖీ కడుతున్న కీర్తి సురేష్ పోస్టర్ ని భోళా శంకర్ నుండి విడుదల చేశారు. ఓ పక్క స్టార్ హీరోయిన్ గా ఉన్న కీర్తి సురేష్ చిరు చెల్లి పాత్ర చేయడం అనూహ్యమే అని చెప్పాలి. 


గతంలోనే కీర్తి చిరంజీవి చెల్లి పాత్ర చేయనున్నారంటూ ప్రచారం జరిగింది. నేటి అధికారిక ప్రకటన దీనిపై స్పష్టత వచ్చింది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర భోళా శంకర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2022లో భోళా శంకర్ థియేటర్స్ లో దిగనున్నాడు. భోళా శంకర్ తో పాటు లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్, అలాగే దర్శకుడు బాబీ చిత్రాలను చిరంజీవి ప్రకటించారు. ఇక దర్శకుడు కొరటాల శివతో చేస్తున్న ఆచార్య విడుదలకు సిద్ధం అవుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios