Asianet News TeluguAsianet News Telugu

నాని ‘దసరా’ నుంచి సాలిడ్ అప్డేట్.. పండుగ కానుకగా అదిరిపోయే అనౌన్స్ మెంట్.!

నేచురల్ స్టార్ నాని (Nani) ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అందింది. విజయదశమి సందర్భంగా ‘దసరా’ మూవీ నుంచి తాజాగా మాస్ అప్డేట్ అందించారు మేకర్స్. ఈ అఫిషియల్ అనౌన్స్ మెంట్ అభిమానుల్లో జోష్ ను పెంచుతోంది. 
 

A solid update from Nanis Dasara Movie, An announcement that will be a festive gift!
Author
First Published Sep 29, 2022, 5:24 PM IST

విభిన్న కథలతో నేచురల్ స్టార్ నాని తన అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నారు. చివరిగా  ‘శ్యామ్ సింగరాయ్’, ‘అంటే సుందరానికీ’ చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం నాని  నటిస్తున్న మాస్ యాక్షన్ ఫిల్మ్ ‘దసరా’(Dasara). ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు షెడ్యూళ్లు పూర్తి చేసుకోగా.. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. దసరా పండుగా కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని తొలుత ప్లాన్ చేశారు మేకర్స్. కానీ కుదరలేదు. దీంతో దసరా పండుగకు మాస్ అప్డేట్ ను మాత్రం అందించనున్నారు. ఈ సందర్భంగా అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ అందింది.

నాని - కీర్తి సురేష్ (Keerthy Suresh) జంటగా నటిస్తున్న చిత్రం ‘దసరా’. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. గోదావరి మైన్స్ ప్రాంతంలో చిత్రీకరణ కొనసాగుతోంది. ఆ సమీపంలోని ఓ గ్రామంలో సాగే కథగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే చిత్రానికి సంబంధించిన న్యూస్ లు ఇంటర్నెట్ లో చాలానే చక్కర్లు కొట్టాయి. తాజాగా మేకర్స్ అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. దసరా పండగ కానుకగా దసరా రోజున ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ (Dhoom Dhaam Dhosthaan) టైటిల్ తో ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. 

ఈ మాస్ సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలవనున్నట్టు తెలుస్తోంది. అనౌన్స్ మెంట్ తో పాటు వదిలిన ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ గ్లింప్స్ కూడా అదిరిపోయింది. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ‘దసరా’కు గట్టిగానే మాస్ బీట్స్ అందించినట్టు తెలుస్తోంది. దీంతో ఫస్ట్ సింగిల్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. మాస్ యాంగిల్లో నాని దుమ్ములేపనున్నాడని అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతోంది. 

తొలిసారిగా నాని కేరీర్ లో పాన్ ఇండియా ఫిల్మ్ గా  ‘దసరా’ రిలీజ్ కాబోతోంది. దీంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే మూవీ నుంచి వస్తున్న అప్డేట్స్ ఉంటుండటం విశేషం. చిత్రంలోని యాక్షన్ సీన్స్, సాంగ్స్ మాత్రం ఓ రేంజ్ లో ఉంటాయని టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మాత చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమాను గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios