#Pushpa2:‘పుష్ప’ కు పెద్ద పనే, బ్యాంకాక్ సీన్స్ ఇక్కడితో మ్యాచ్ చేయాలి

‘పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫైరు..’,‘ తగ్గేదేలే’ అంటూ యావత్‌ భారత సినీ అభిమానులను అలరించారు అల్లు అర్జున్‌ (Allu arjun). ఆయన  హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప: ది రైజ్‌’ గతేడాది విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకొస్తున్నట్లు చిత్ర టీమ్ అప్పుడే ప్రకటించింది.

A schedule of Pushpa: The Rule will also take place Bangkok forests


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప-ది రైజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ స్దాయి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా తెలుగులో తెరకెక్కినా, ఇతర భాషల్లోనూ అదరకొట్టింది. ఈ సినిమాలో అల్లు అర్జునవ్ పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండటంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘పుష్ప – ది రూల్’ ప్రారంభం కావటంతో , ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా గురించి వచ్చిన అప్డేట్ ..ఇంట్రస్టింగ్ గా ఉంది. అదేమిటంటే..

‘పుష్ప1’ ఘన విజయం సాధించడంతో రెండో భాగంపై మరింత దృష్టి పెట్టారు దర్శకుడు సుకుమార్‌. మొదట అనుకున్న స్క్రిప్ట్‌నకు మరిన్ని మెరుగులు దిద్దేందుకు ఎక్కువ సమయం తీసుకున్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్‌ కూడా ఆయనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. సినిమా ఆలస్యమైనా పర్వాలేదు కానీ, అద్భుతమైన కథా,స్క్రీన్ ప్లే తో ముందుకు వెళ్లాలని సూచించారు. దీంతో రెండో భాగం రీసెంట్ గానే  పట్టాలెక్కింది.  ‘పుష్ప2’ షూటింగ్‌ ‘తగ్గేదేలే’ అన్నట్లు జరుగుతోంది.  ఈ సినిమా రెండు షెడ్యూల్స్ హైదరాబాద్ లో జరగనున్నాయి. అవి చిన్న షెడ్యూల్సే. చిన్న చిన్న గ్యాప్ లతో రెండూ జరగనున్నాయి. అసలైన పెద్ద షెడ్యూల్..బ్యాంకాక్ లో జరగనుంది. అది కంటిన్యూగా రెండు నెలలు పాటు సాగనుందని సమాచారం. ఏ బ్రేక్ లు లేకుండా కంటిన్యూ షెడ్యూల్స్ తో అక్కడ షూట్ ఫినిష్ చేసి వస్తారు. అయితే బ్యాంకాక్ అడవుల్లో షూట్ జరిగినా కథ ప్రకారం ఇక్కడ ఇండియాలో జరిగినట్లే. మారేడిమిల్లి అడవుల్లో కొంత షూట్ చేసి... బ్యాంకాక్ షెడ్యూల్ లో అవుట్ ఫుట్ ని మ్యాచ్ చేస్తారని సమాచారం. అది పెద్ద పనే అయినప్పటికీ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక జాగ్రత్తలతో షూట్ చేయటంతో పెద్ద కష్టమేమీ కాదంటున్నారు.
 
 ఈ షూటింగ్ కోసం చిత్ర హీరోతో పాటు మిగతా నటీనటులు కూడా సిద్ధమయ్యారట. ఇక అఫీషియల్‌గా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.  మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా…ఇక ఈసినిమాలో ఫహాద్ ఫాజిల్ భన్వర్ సింగ్ షెకావత్ గా, రష్మిక శ్రీ వల్లి గా, సునీల్ మంగళం శ్రీనుగా అనసూయ దాక్షాయణి గా కనిపించనున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios