Asianet News TeluguAsianet News Telugu

రెహమాన్ అభిమానులకు షాక్ , పరమచెత్త షో అంటూ.. మండిపాటు

ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటే పడి చచ్చిపోతారు జనాలు.. ఆయన లైవ్ ప్రోగ్రామ్ అంటే ఎంత డబ్బు పోసి అయినా చూడాలి అనుకుంటారు. కాని అదే రెహమాన్ షో మీద... అదే అభిమానులు మండిపడిన సందర్భం  తాజాగా చోటు చేసుకుంది. 

A R Rehaman Fans Disappointed On Music Consert In Chennai JMS
Author
First Published Sep 12, 2023, 9:32 AM IST

రెహమాన్ షో అంటే చాలు.. లక్షలు పోసి చూసేవారు అన్నారు. అది వారి అభిమానం. తన స్వరాలతో అభిమానుల మనసులను దోచుకున్న స్వర మాత్రికుడు రెహమాన్. ప్రపంచంలో ఎక్కడ రెహమాన్ మ్యూజిక్ షో జరిగినా సరే అక్కడ  జనసందోహం కామన్ గా కనిపిస్తుంది. అటువండిది ఆయన సొంత ఊరిలో లైవ్ షో అంటే రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఊహించడానికి సాధ్యం కాదు. తాజాగా అదే జరిగింది. చెన్నైలో రెహమాన్ షో జరిగింది. 

మురుక్కమ్‌ నెంజన్‌ అనే పేరుతో స్వర మాంత్రికుడు ఏ.ఆర్‌ రెహమాన్‌ చెన్నైలో ఓ మ్యూజికల్ నైట్ ను ను ఏర్పాటు చేశారు. మాములుగానే ఆయన కచేరి ఎక్కడ పెట్టిన జనాలు లక్షల్లో వస్తుంటారు. అలాంటిది తన స్వస్థలం చెన్నైలో కచేరి అంటే ఏ రేంజ్‌లో సంగీత ప్రియులు వస్తారనేది ఊహించడం కష్టం. ప్రముఖ ఆర్గనైజర్‌ కంపెనీ ఏవీటీసి ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. 

అయితే రెహమాన్ షో కావడం.. పైగా  ప్రమోషన్‌ కూడా జోరుగా జరపడంతో.. టిక్కెట్‌లు హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఆదివారం కావడంతో ఇంకా ఎక్కువ టికెట్లు అతమ్ముడయ్యాయి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ను పక్కన పెట్టి మరీ.. రెహమాన్ షోకి టికెట్లు కొన్నారు. కాని టికెట్ కొని షోలోకి వెళ్ళిన వారికి షాక్ ఇచ్చారు ఆర్గనైజర్లు.  టిక్కెట్‌లు కొన్నవాళ్లలో చాలా మందికి అక్కడ సీట్లు లేకపోవడం తో షాక్ అయ్యారు. జనాలు ఎక్కు రావడంతో.. సీట్లు ఉన్నది లేనిది చూసుకోకుండా.. ఎడా పెడా టికెట్లు అమ్మేశారు జనాలు.  అంటే సీటింగ్‌ కెపాసిటీ కంటే ఎక్కువ సంఖ్యలో టిక్కెట్‌లు అమ్మారు. 

 

దాంతో కాన్సర్ట్‌ చూడడానికి వచ్చిన వందలాది ఫ్యాన్స్‌ కూర్చోడానికి సీట్లు కూడా లేకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. వేలకు వేలు ఖర్చుపెట్టుకుని వస్తే ఇలా చేయడం కరెక్ట్‌ కాదని ఆర్గనైజైషన్‌పై మండిపడ్డారు. పోని లోపల ఉన్న వాళ్లయినా కాన్సర్ట్‌ను ఎంజాయ్‌ చేశారా అంటే అదీ లేదు. సౌండ్ సిస్టమ్‌ సరిగ్గా లేకపోవడం.. వెనకాల కూర్చున్న వారికి అసలు పాటలే వినిపించక పోవడం వంటివి జరిగాయి. ఆ పరిణామాలు ఎంతదాకా వచ్చాయంటే కాన్సర్ట్‌ను మధ్యలోనే ఆపాల్సి వచ్చింది.

ఈ విషయంపై మండిపడ్డుతున్నారు రెహమాన్ ఫ్యాన్స్. ఇదేం పని అంటూ కోపంతో ఊగిపోతున్నారు. న్నో లైవ్‌ కాన్సెర్ట్‌లకు వెళ్లాం కానీ.. ఇలాంటి సంఘటనలు మాత్రం జరగడం ఇదే తొలిసారని నిరాశను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా స్కామ్‌2023 అని ట్విట్టర్‌లో పెద్ద మొత్తంలో ట్రెండింగ్‌ చేస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios