దాదాపు 15 ఏళ్లకు పనైగా భారతీయ సంగీతాన్ని ఏలిన రారాజు ఏఆర్ రెహమాన్. ఆయన ఎక్కువ సంగీతం చేసింది తమిళ సినిమాలకే.అంతే కాదు రెహమాన్ తెలుగు సినిమా చేయక దాదాపు 13 ఏళ్ళు అవుతుంది.
ఒకప్పుు ఇండియన్ సినిమా మ్యూజిక్ ను ఒక ఊపు ఊపి వదిలిపెట్టాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఆయన మ్యూజిక్ చేయడం అంటే.. అది ఏ పెద్ద సినిమానో అయ్యి ఉండాలి..దాదాపు 15 ఏళ్లకు పనైగా భారతీయ సంగీతాన్ని ఏలిన రారాజు ఏఆర్ రెహమాన్. ఆయన ఎక్కువ సంగీతం చేసింది తమిళ సినిమాలకే.. ఆతరువాత తెలుగు, హిందీ సినిమాలకు మ్యూజిక్ చేవారు రెహ్మాన్. అంతే కాదు తమిళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అవ్వడంతో.. తెలుగులో కూడా రెహమాన్ పాటలకు ఇక్కడ కూడా డైహార్ట్ ఫ్యాన్స్ పెరిగిపోయారు. దేశ వ్యాప్తంగా రెహమాన్ పాటలకు అభిమానులు ఉన్నారు.
ఈక్రమంలో ఇండియన్ సినిమా చరిత్రలో.. మ్యూజిక్ కు మొదటి ఆస్కార్ సాధించిన ఘనత రెహమాన్ దే. ఇక గత కొన్నేళ్లుగా ఆయన సినిమాలకు డిమాండ్ తగ్గిపోయింది. సినిమాలకు మ్యూజిక్ చేయడం కూడా తగ్గించేశారు రెహమాన్. అంతే కాదు రెహమాన్ తెలుగు సినిమా చేయక దాదాపు 13 ఏళ్ళు అవుతుంది. అది ఎందుకు జరిగిందో తెలియదు కాని.. తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగులో ఆయన పాటలు వినిపించాయి కాని.. డైరెక్ట్ తెలుగు సినిమా చేసింది లేదు రెహమాన్. ఈక్రమంలో ఇన్నేళ్ళకు ఆయన తెలుగు సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ఆర్‌ఆర్‌ఆర్ తో గ్లొబల్ స్టార్ గా మారిపోయాడు రామ్‌చరణ్. హాలీవుడ్ స్టాయిలో రామ్ చరణ్ పేరు మారుమోగిపోయింది. అంతర్జాతీయ స్థాయిలో చరణ్ కు గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలో చరణ్ సినిమాలకు సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈమూవీ ఫైన్ స్టేజ్ షూటింగ్ లో ఉంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.
ఇక చరణ్ ఈ సినిమా సెట్స్ పైన ఉండగానే.. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబుతో సినిమాను అనౌన్న్ చేశాడు. ఆర్ సీ 16 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోయే ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈసినిమా కు సబంధించి ఓ అప్ డేట్ వైరల్ అవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఫిక్సయ్యాడు. స్వరమాంత్రికుడు ఏ.ఆర్ రెహమాన్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాబోతున్నట్లు తాజాగా రామ్‌చరణ్ ఓ ఇంటర్వూలో చెప్పాడు. ఇదే గనుక ఫైనల్ అయితే 2010లో వచ్చిన కొమురం పులి తర్వాత మళ్లీ పదమూడేళ్లకు తెలుగు రెహమాన్ స్ట్రేయిట్ తెలుగు సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కునున్న ఈ సినిమాను మైత్రీ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా జాన్వీని తీసుకునే అవకాశాలున్నాయని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీలైనంత త్వరగా షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్ వరకూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.
