టెన్నీస్ క్రీడాకారిణి ఫేర్ వెల్ పార్టీ ఆదివారం సాయంత్రం హైదరాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఇందులో మహేష్‌బాబు, నమ్రత జంట, అలాగే సంగీత దర్శకుడు రెహ్మాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఆదివారంతో తన ఆటకి ముగింపు పలికింది. ఎక్కడైతే తన ఆటని ప్రారంభించిందో, అదే స్టేడియంలో చివరి ఆట ఆడి ప్రపంచ టెన్నిస్ క్రీడకి దూరమయ్యింది. రెండు దశాబ్దాల క్రితం ఎల్బీ స్టేడియంలో ఆమె టెన్నిస్‌తో ప్రపంచ స్థాయి క్రీడలోకి అడుగుపెట్టింది. ఇక ఆదివారం(మార్చి 5న) అక్కడే చివరి ఆట ఆడింది సానిమా మీర్జా. ఈ సందర్బంగా ఆమె ఎమోషనల్ అయ్యారు. ఇదిలా ఉంటే సానియా మీర్జా ఫేర్‌వెల్ పార్టీ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
ఇందులో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు మహేష్‌బాబు, నమ్రత, సంగీత దర్శకుడు ఏఆర్ రెమ్మాన్. సానియా మీర్జాతో కలిసి ఆయన ఫోటోలు దిగారు. ఈ ఫోటోని పంచుకుంటూ ట్వీట్ చేశారు మహేష్. ఇందులో ఆయన చెబుతూ, ఆమెది అద్భుతమైన ప్రయాణం అని, చాలా గర్వంగా ఉందని తెలిపారు మహేష్. ఇందులో మహేష్ బ్లాక్ స్వెట్‌షార్ట్, ఖాకీ ప్యాంట్ ధరించారు. చాలా స్టయిలీష్‌గా ఉన్నారు. లుక్ చాలా స్లిమ్‌గా, మరింత యంగ్‌గా ఉండటం విశేషం. ఇందులో సానియా బ్లాక్ డ్రెస్‌లో హోయలు పోయింది.
ఇదిలా ఉంటే ఇందులో ఏఆర్ రెహ్మాన్.. మహేష్‌తో సెల్ఫీ తీసుకోవడం హైలైట్‌గా మారింది. ఆ సెల్ఫీని తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు రెహ్మాన్. దీనిపై మహేష్ రియాక్ట్ అయ్యారు. `లెజెండ్ స్వయంగా ఈ ఫోటోని తీశారు. మిమ్మల్ని కలవడం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది రెహ్మాన్ సర్ అని పేర్కొన్నారు మహేష్. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇక సానియా మీర్జా ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు, సన్నిహితులు, ప్రేక్షకులకు రకరకాల భిన్నమైన భావోద్వేగాలను కలిగించింది. ఓ అభిమాని అయితే కన్నీరు పెట్టుకోవడం విశేషం. ఆట జరుగుతున్నంత సేపు స్టేడియం కేకలతో హోరెత్తిపోయింది. సానియా పాయింట్ దక్కించుకున్న ప్రతిసారి పెద్దఎత్తున అభినందనలు.. చప్పట్లు, కేకలతో స్టేడియం మారుమోగిపోయింది. ఈ మ్యాచ్లో సానియా జోడినే గెలిచింది.
ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ కు హాజరైన తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ఆటగాళ్లందరికీ శాలువాలతో సత్కరించారు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ప్రత్యేకంగా శాలువాతో పాటు జ్ఞాపిక ఇచ్చి అభినందించారు. ఆ తర్వాత మాట్లాడిన సానియా మీర్జా తీవ్ర భావోద్వేగానికి గురైంది. కుమారుడు ఇజాన్ తో కలిసి మాట్లాడుతూ.. మధ్యలో ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేక గద్గద స్వరంతోనే మాట్లాడింది. ఈ సందర్భంగా తన ఎదుగుదలకు కారణమైన హైదరాబాద్ కు, తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. అభిమానులకు అభివాదం చేసింది. వారు లేకపోతే తాను లేనని చెప్పుకొచ్చింది.
తనలాంటి సానియాలు ఎంతోమంది వస్తారని, రావాలని ఆశించింది. ఆ తర్వాత టెన్నిస్ బంతులను ప్రేక్షకులకు విసురుతూ అభివాదం చేసింది. తనయుడు ఇజాన్ తో కలిసి కోర్టు నుంచి నిష్క్రమించింది ఈ కార్యక్రమానికి క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, క్రీడల కార్యదర్శి సందీప్ సుల్తానియా, టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్, నగర కమిషనర్ సివి ఆనంద్, షాట్స్ చైర్మన్ ఆంజనేయ గౌడ్, చాముండేశ్వరి నాథ్, హీరో దుల్కర్ సల్మాన్ లు హాజరయ్యారు.
