బుచ్చిబాబు ఉప్పెనకుకు జాతీయ అవార్డ్ రావడం.. ఆర్ఆర్ఆర్ కు ఆరు అవార్డ్ లు రావడంతో.. రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాపై అందరి దృష్టి మళ్ళింది. ఇక ఈసినిమాకు సంబంధించిన తాజాగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్
గ్లోబల్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు చరణ్.. ఈసినిమా తరువాత ఆయన బుచ్చిబాబు సానతో భారీ బడ్జెట్ మూవీ చేయబోతున్నాడు. ఈక్రమంలో ఈ భారీ చిత్రం స్టార్ట్ కాకముందే భారీ హైప్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా బుచ్చిబాబుకు జాతీయ అవార్డ్ రావడంతో ఈసినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. క్యూరియాసిటీ కూడా పెరుగుతుంది. అటు ఈసినిమాకు రెహమాన్ మ్యూజిక్ చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలు కూడా చరణ్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్నినింపుతున్నాయి.
ఇక లేటెస్ట్ గా దర్శకుడు బుచ్చిబాబు ఈ విషయంపై ఇచ్చిన క్లారిటీ సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్తున్నాయి.లేటెస్ట్ గా ఈసినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలు వెల్లడించాడు దర్శకుడు బుచ్చిబాబు. అంతే కాదు వాటిని రివీల్ చేస్తూ ఈ సినిమాకు రెహమాన్ సంగీతంపై కూడా ఓపెన్ అయ్యాడు. ఆయన మాట్లాడుతూ.. ఈసినిమాకు రెహమాన్ సంగీతం చేస్తే బాగుంటుంది అని నేను ముందు నుంచి అనుకుంటున్నారు. ఇక అదే మాట హీరోకి నిర్మాతలకి చెప్తే కాదనలేదు అన్నారు.
ఇక ఈ సినిమా కు మ్యూజిక్ చేయాలి అని రెహమాన్ ను కలవడం.. ఆయన కథ విన్నాక ఏ ఆర్ రెహమాన్ గారు తనకి చాలా నచ్చేసింది అని ఇలాంటి కథ ఈ మధ్యలో ఎప్పుడూ వినలేదు తప్పకుండా మనం సినిమా చేద్దాం అని చెప్పారని బుచ్చిబాబు తెలిపాడు. మరి రెహమాన్ లాంటి సంగీత దర్శకున్ని కదిలించే రేంజ్ లో ఈ కథ ఉందంటే.. ఈసినిమా చరణ్ కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది. చరణ్ ను బుచ్చిబాబు డీల్ చేయగలడా లేదా.. అనేది చూడాలి.
