Asianet News TeluguAsianet News Telugu

‘సైంధవ్’ ఈవెంట్ లో పాటలు.. బాల్కానీలో అమ్మాయి డాన్స్.. కొద్దిలో సెలబ్రెటీ ఛాన్స్ మిస్.. వీడియో!

విక్టరీ వెంకటేశ్ లేటేస్ట్ ఫిల్మ్ ‘సైంధవ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా ఓ అమ్మాయి చేసిన పనికి సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది. అందరూ ఫిదా అవుతున్నారు. 

A Girl Dance in Balcony to Saindhav Pre Release Event Songs NSK
Author
First Published Jan 8, 2024, 6:27 PM IST

టాలీవుడ్ సీనియర్ నటుడు, విక్టరీ వెంకటేశ్ (Venkatesh)  - సైలేష్ కొలను కాంబోలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘సైంధవ్’ Saindhav. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నిన్న సాయంత్రం వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో గ్రాండ్ గా జరిగింది. వేడుకకు వెంకీ, నవాజుద్దీన్, హీరోయిన్ల శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, బేబీ సారా హాజరై సందడి చేశారు. అలాగే దర్శకుడు శైలేష్ కొలను కొంతమంది అతిథులు కూడా వచ్చారు. 

ఇక  వెంకటేశ్ అభిమానులు, వైజాగ్ ప్రజలు ఈవెంట్ కు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వేడుకను విజయవంతం చేశారు. గెస్ట్ లు, టీమ్ యూనిట్, హీరోతో పాటు హీరోయిన్లు తమ క్యూట్ స్పీచ్ తో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకను ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేసిన ఓ అమ్మాయి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటి వరకు ఏ ఈవెంట్ కు ఇలా జరగలేదు. 

ఇంతకీ ఏమైందంటే... ‘సైంధవ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మ్యూజిక్ టీమ్ చిత్ర పాటలను స్టేజీపై పెర్ఫామ్ చేశారు. ఆ పాటలకు దూరంగా పై అంతస్తులో ఓ అమ్మాయి తమ ప్లాట్ లోని బాల్కానీలో డాన్స్ చేస్తూ కనిపించింది. ఈ దృశ్యాన్ని అక్కడి వారు వీడియో తీశారు. వెంకీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పాటలకు డాన్స్ చేస్తున్న అమ్మాయిని చూడండి అంటే నెట్టింట షేర్ చేశారు. దీంతో వీడియో వైరల్ గా మారింది. 

చీకటి కావడంతో ఆ అమ్మాయి ఫేస్ అంతగా కన్పించలేదు. లేదంటే ఓవర్ నైట్ లో ఆమె కూడా సెలబ్రెటీగా మారిపోయేదంటున్నారు. ఇక ఆమె డాన్స్ కు మాత్రం అంతా ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం వీడియోను నెట్టింట వైరల్ చేస్తున్నారు. మూవీ విషయానికొస్తే.. సంక్రాంతి కానుకగా ‘సైంధవ్’ జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios