Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ కు కెనడా ఫ్యాన్స్ సర్ ప్రైజ్.. ఆరు హెలికాప్టర్లతో సినిమాటిక్ సెల్యూట్.. వీడియో

‘సలార్’ రిలీజ్ కు ముందుకు ప్రభాస్ కెనడా ఫ్యాన్స్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆరు ఎలికాఫ్టర్లతో ఎయిర్ సెల్యూట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ను హంబలే ఫిల్మ్స్ అధికారికరంగా పంచుకోవడంతో నెట్టింట వైరల్ గా మారింది.

A Cinematic Air Salute to Rebel Star Prabhas and Hombale Fims by Canada Fans NSK
Author
First Published Dec 17, 2023, 1:25 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhash)   నుంచి ‘సలార్’ విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel)  దర్శకత్వం వహించడంతో మరింతగా అంచనాలు ఉన్నాయి. Salaar Cease Fire డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ ను ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. సలార్ టీమ్ అండ్ డార్లింగ్ ప్రభాస్ కు కెనడా నుంచి అభిమానులు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆరు ఎలికాఫ్టర్లతో ఎయిర్ సెల్యూట్ చేసి ఆకట్టుకున్నారు. 

రెబల్ స్టార్ ప్రభాస్ కు ప్రపంచమంతటా అభిమానులున్నారు. ఈ ఫ్యాన్స్ ప్రభాస్ పుట్టినరోజున, ఆయన కొత్త సినిమా రిలీజైన సందర్భంలో తమ అభిమానాన్ని వినూత్న పద్ధతిలో ప్రదర్శించడం చూస్తుంటాం. ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ సలార్ మరో ఆరు రోజుల్లో గ్రాండ్ గా థియేటర్స్ లోకి రిలీజ్ కు వస్తోంది. ఈ నేపథ్యంలో కెనడాలోని రెబల్ స్టార్ అభిమానులు తమ ఫేవరేట్ హీరో ప్రభాస్ కు ఎయిర్ సెల్యూట్ చేశారు. 

నేల మీద భారీ సలార్ పోస్టర్ డిజైన్ చేయించి..వివిధ రంగుల్లోని ఆరు హెలికాప్టర్స్ తో గాలి నుంచి ఆ పోస్టర్ కు సెల్యూట్ చేయించారు. చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ఈ వీడియోను షేర్ చేసింది. ఓ భారీ హాలీవుడ్ సినిమా స్టైల్ లో యూనివర్సల్ డార్లింగ్ ప్రభాస్ కోసం అభిమానులు చేసిన ఈ ఫీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నెల 22న సలార్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా రెబల్ స్టార్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరగందూర్ రూ.300 కోట్లతో నిర్మించారు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్. శ్రియా రెడ్డి, జగపతి బాబు, ఈశ్వరీ రావు, సప్తగిరి వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios