మెగా స్టార్ చిరంజీవి - దర్శకుడు బాబీ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘మెగా154’. మెగా అభిమానులకు ఈ మూవీ నుంచి బిగ్ ట్రీట్ రెడీ అయ్యింది. తాజాగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు.
మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) చిరంజీవి ‘ఆచార్య’తో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. ఏకకాలంలో మూడు చిత్రాల్లో నటిస్తున్న చిరు ఒక్కో చిత్రాన్ని ఫినిష్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటికే ‘గాడ్ ఫాదర్’ మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న మెగాస్టార్ ప్రస్తుతం ‘భోళా శంకర్’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. లేటెస్ట్ గా బాబీ - చిరు కాంబినేషన్ లో వస్తున్న ‘మెగా154’ నుంచి అదిరిపోయే అప్డేట్ అందింది.
ఎప్పటి నుంచో ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు మేకర్స్ బిగ్ ట్రీట్ ను రెడీ చేశారు. ఈ రోజు సాయంత్రం 4:05 నిమిషాలకు ఈ అప్డేట్ రిలీజ్ కానుంది. పూనకాలు వచ్చే మెగా మాస్ అప్డేట్ ను వదలనున్నట్టు తెలిపారు. దీంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) అనే టైటిల్ ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ రోజూ టైటిల్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారని, దాంతో మరో మాసీవ్ అప్డేట్ కూడా వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
‘మెగా 154’ వర్క్ టైటిల్ తో ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. వచ్చే ఏడాది చిత్రాన్ని సక్రాంతి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. లేటెస్ట్ అప్డేట్ తో మరింతగా హైప్ క్రియేట్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ గా శృతి హాసన్ (Shruti Haasan) నటిస్తున్న విషయం తెలిసిందే. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమై మ్యూజిక్ అందిస్తున్నారు.
