ఓటీటి తో మళ్లీ మెగాస్టార్ కి అవమానం?

చిరంజీవికు భాక్సాఫీస్ దగ్గర ఉన్న క్రేజ్ వేరు. ఇప్పటికీ ఆయన అభిమాన బలం చెక్కుచెదరలేదు. అయితే భోళా శంకర్ వంటి సినిమాలు...

A big embarrassment for Chiranjeevi Bholaa Shankar is releasing on OTT jsp

ఒక స్టార్ సినిమా ప్లాఫ్ అయ్యిందంటే ఇంతకు ముందు రోజుల్లో ఆ విషయం బయిటకు వచ్చేసరికి చాలా టైమ్ పట్టేది. ఈలోగా ఆ సినిమాలు యాభై రోజులు జరిగిపోయేవి. ఇప్పుడు సీన్ మారిపోయింది. యుఎస్ షోతోటే సినిమా భవిష్యత్ క్షణాల్లో ప్రపంచం అంతటా తెలిసిపోతోంది. సినిమా ఫ్లాఫ్ అయ్యిందని టాక్ వచ్చిందంటే యాంటి ఫ్యాన్స్ రెచ్చిపోతారు. మీమ్స్ తో సోషల్ మీడియాని హోరెత్తించేస్తారు. రీసెంట్ గా భోళా శంకర్ సినిమాకు అదే జరిగింది. జనం మర్చిపోయారు అనుకునేలోగా ఇప్పుడు మరోసారి ఆ సినిమా గురించన నెగిటివ్ పోస్ట్ లు మొదలవుతున్నాయి. అందుకు కారణం..
 
వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్‌ హిట్‌ ను అందుకున్న మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం భోళాశంకర్‌.ఈ సినిమాకు మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహించారు.ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాలతో ఆగస్టు 11న థియేటర్లలోకి వచ్చిన భోళాశంకర్‌ సినిమా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. మొదటి షో నుంచే డిజాస్టర్ టాక్‌ రావడంతో  అభిమానులు నిరాశపడిపోయారు. 

ఈ మెగా మూవీపై అంచనాలు భారీగానే ఉన్నప్పటికీ సినిమా మాత్రం చాలా దారుణమైన కలెక్షన్స్‌ రాబట్టింది.  మెగాస్టార్‌కు ఈ రేంజి ఫ్లాప్‌ ఇచ్చినందుకు డైరెక్టర్‌ మెహర్‌ రమేశ్‌ను నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారు. ఈ నెగెటివ్‌ టాక్‌ వల్ల చాలామంది ఈ సినిమావైపు కన్నెత్తి చూడలేదు. కానీ  ఓటీటీలో ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ లో వచ్చేసింది. ఈ మూవీ డిజిట్‌ హక్కులు సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్‌ ఈ నెల 15 నుంచి భోళాశంకర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేసింది.  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 

థియేటర్లలో ఈ సినిమా చూడటం మిస్‌ అయినవాళ్లు ఓటీటీలో ఓసారి చూద్దామని ఫిక్సై, సగం చూసి ఆపేసామని పోస్ట్ లుపెడుతున్నారు. ఇంకొందరు ఇప్పుడు తమ స్పందన తెలియచేస్తున్నారు. దాంతో ట్విట్టర్, పేస్ బుక్ లలో మళ్లీ భోళా శంకర్ గురించి పోస్ట్ లు మొదలవుతున్నాయి. ఓటిటితో మరోసారి చిరుకు అవమానం ఎదురైనట్లే అంటున్నారు. 
ఈ సినిమా కోలీవుడ్‌ స్టార్‌ అజిత్‌ వేదాళం సినిమాకు ఇది రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే! ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించగా కీర్తి సురేశ్‌ చిరు చెల్లెలిగా నటించింది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios