తమిళంలో ఇటీవల కాలంలో విడుదలైన సూపర్ హిట్ గా నిలిచినచిత్రం '96'. విజయ్ సేతుపతి, త్రిష నటించిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. శర్వానంద్-సమంత కాంబినేషన్ లో దిల్ రాజు ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

ఒరిజినల్ దర్శకుడే ప్రేమ్ కుమార్ తెలుగు వెర్షన్ ని కూడా డైరెక్ట్ చేయబోతున్నారు. అయితే టైటిల్ గా మాత్రం తెలుగు పేరుని పెట్టాలని దిల్ రాజు ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో ఈ క్రమంలో 'జానకీదేవి' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

మొదట 'జాను', 'జాను అలియాస్ జానకి' అనే టైటిల్స్ ని పరిశీలించారు. కానీ ఫైనల్ గా 'జానకీదేవి' అనే టైటిల్ పై మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే టైటిల్ ని ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించడంతో దాదాపు ఈ టైటిల్ ఖరారైనట్లు సమాచారం. 

మార్చి 6న శర్వానంద్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టైటిల్ లోగోని లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాడు. వచ్చే నెల నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు.