శ్రీలంక క్రికెటర్‌, వరల్డ్ బెస్ట్ స్పిన్‌ బౌలర్‌ ముత్తయ్య మురళీ ధరన్‌ జీవితం ఆధారంగా `800` పేరుతో ఓ బయోపిక్‌ రూపొందుతుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు.

శ్రీలంక స్పిన్నర్‌ ముత్తయ్య మురళీ ధరన్‌ జీవితం ఆధారంగా `800` పేరుతో సినిమా రూపొందుతుంది. ముత్తయ్య మురళీధరన్‌ పాత్రలో మధుర్‌ మిట్టర్‌ నటిస్తుండగా, మహిమా నంబియార్‌ ఫీమేల్‌ లీడ్‌గా చేస్తుంది. ఎంఎస్‌ శ్రీపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని తెలుగులో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్‌ రిలీజ్‌ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. క్రికెట్‌ గాడ్‌ సచిన్‌, ముత్తయ్య మురళీ ధరన్‌ వంటి వారి గెస్ట్ లుగా ఈ ట్రైలర్‌ ఈవెంట్‌ జరిగింది. 

ఇక తాజాగా రిలీజ్‌ అయిన ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో ముత్తయ్య మురళీధరన్‌ చిన్నప్పట్నుంచి క్రికెటర్‌గా ఎదిగిన జర్నీని, ముఖ్యంగా ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను చూపించారు. శ్రీలంకకి తమిళనాడు నుంచి వలస రావడం, అక్కడ పౌరసత్వానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవడం, అవన్నీ దాటుకుని క్రికెట్‌(బౌలర్‌)గా ఎదగడం, చివరికి క్రికెటర్‌ అయ్యాక కూడా అవమానాలను ఫేస్‌ చేయడం, జాతి వివక్షతని ఫేస్‌ చేయడం, ఎల్టీటీ వారు కలవడం, ఆ తర్వాత కాల్పులు, దీంతోపాటు బౌలింగ్‌ వేసే టప్పుడు తన చేయు స్ట్రెయిట్‌గా ఊపడం లేదంటూ అంతర్జాతీయ క్రికెట్‌లో అడ్డంకులు ఎదురు కావడం, వాటన్నింటిని ఎదుర్కొని స్పిన్‌ బౌలింగ్‌లో ఓ పాత్‌ బ్రేకింగ్‌ బౌలర్‌గా, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ప్రపంచ రికార్డులు సృష్టించడం వంటి అంశాలను ఈ ట్రైలర్‌లో చూపించారు.

ఆద్యంతం ఎమోషనల్‌ జర్నీగా `800`ట్రైలర్‌ సాగింది. ముత్తయ్య మురళీధరన్‌ జీవితంలోని ఆటుపోట్లని, అవమానాలను ప్రధానంగా చూపించినట్టు తెలుస్తుంది. దేశం తిరిగి చూసేలా ఓ పేద వాడు గొప్ప వాడు అయిన తీరుని ఇందులో చూపించిన తీరు ఇన్‌స్పైర్‌ చేస్తుంది. ట్రైలర్‌లో తాను తమిళవాడుని మాత్రమే కాదు క్రికెటర్‌ని అని చెప్పే డైలాగ్ అదిరిపోయింది. ఇందులో ముత్తయ్య మురళీధరన్‌ పాత్రలో మధుర్‌ మిట్టర్‌ ఒదిగిపోయారు. పాత్రకి ప్రాణం పోశారు. ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. వైరల్ అవుతుంది. ఈ సినిమాని త్వరలోనే విడుదల చేయబోతున్నారు. పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది.

YouTube video player