Asianet News TeluguAsianet News Telugu

70 ఏళ్ళ వయస్సులో 7వ తరగతి పరీక్షలు రాసిన నటుడు ఎవరోతెలుసా..?

చదువుకు వయస్సుతో సంబంధం లేదు అని చాలామంది నిరూపించారు. అందులో సినిమావాళ్లకు కూడా మినహాయింపు లేదు అని నిరూపించాడు మరో నటుడు. ఇంతకీ విషయం ఏంటంటే..? 

70 Year Old Malayalam Actor Indrans Passes 7th Grade Exam, Showcases Lifelong Learning JMS
Author
First Published Aug 26, 2024, 3:30 PM IST | Last Updated Aug 26, 2024, 3:30 PM IST

చదువుకు వయస్సుతో సబంధం లేదు.. ఈ విషయాన్ని ఇప్పటికే చాలామంది నిరూపించారు. మరణించే సమయంలో కూడా మాస్టర్ డిగ్రీలు పూర్తి చేసినవారు చాలామంది ఉన్నారు. ఈ విషయంలో సినిమా వారు కూడా ముందున్నారు. ఈ క్రమంలోనే ఓ స్టార్ నటుడు 70 ఏళ్ల వయస్సులో 7వ తరగతి పరీక్షలు రాశాడు. వింటానికి విచిత్రంగా ఉంది కదా.. ఇంతకీ అతను ఎవరు.. ఏ ఇండస్ట్రీకి చెందిన వాడు తెలుసా..? 

అతను  ఓ ఫేమస్ మలయాళీ నటుడు 70 ఏళ్ళకు రెండు  యేళ్ల దూరంలో ఉన్నాడు. ఈ  వయసులో 7వ తరగతి పరీక్షలు రాసి పాసైయ్యారు. అతని పేరు  ఇంద్రన్స్. మాలీవుడ్ లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. క్యారెక్టర్ రోల్స్ చేస్తూ.. బిజీగా ఉండే ఇతను తన నటనతో సెంటిమెంట్ సీన్లు పండించడంలో అద్భుత చాతుర్యం కలిగి ఉన్నాడు. ఇక ఎప్పుడు తన యాక్టింగ్ లో ఫేమస్ అవుతూ వచ్చిన ఇంద్రన్స్.. ఇప్పుడు తన చదువుతో పాపులర్ అయ్యాడు. వార్తల్లో నిలిచాడు. 

కేరళలోని అట్టకులంగర స్కూల్లో విద్యార్థులతో కలిసి ఎగ్జామ్స్ రాశారు. అందరి విద్యార్థుల్లాగా ఈయన కూడా పరీక్షలంటే భయమట. ఎట్టకేలకు రాసి వచ్చాడు ఈ స్టూడెంట్. చిన్న వయసులో చదువుకోవడానికి డబ్బుల్లేక చదువుమానేశారట. ఇప్పుడు డబ్బులున్నా...ఈ వయసులో ఏంటనే ..ఇన్నాళ్లు ఊరుకున్నానని ...ఇప్పుడు ధైర్యం చేసి రాశానని అంటున్నారు ఇంధ్రస్.

అయితే ఈయన టెన్త్ క్లాస్ పరీక్షలు ప్రైవేట్ గా రాయాలి అనుకున్నాడట. కాని డైరెక్ట్ గా పది చదవడానికి కేరళలో పర్మిషన్ లేదు. పది చదవాలంటే.. ఖచ్చితంగా  ఏడవతరగతి పాసవ్వాల్సిందే. దాంతో నటుడు ఇంద్రన్స్ కూడా సెవెన్త్ పరీక్షలు రాసి..పై చదువులకు ఆలోచిస్తానంటున్నారు ఇంధ్రస్ ..అంతేకాదు ఇంద్రన్స్ 10వ తరగతికి రాగానే కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా అతడిని ఎంపిక చేయనున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఇండస్ట్రీ లో తన ప్రయాణం మొదలైంది.  ఇప్పటికి 50 సినిమాలకు పైగా చేసి మలయాళంలో టాప్ నటుడిగా నిలిచాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios