వరుడు , సైజ్ జీరో, ఒక రాజు ఒక రాణి వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన హీరో ఆర్య‌. రీసెంట్‌గా క‌దంబ‌న్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ హీరో త్వ‌ర‌లో సుందర్ డైరెక్ష‌న్‌లో సంఘ‌మిత్ర అనే భారీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు. అయితే ఇటీవ‌ల తన ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేసిన ఆర్య పెళ్లి విషయంలో నాకు ఎలాంటి డిమాండ్స్ కానీ.. కండీషన్స్ కానీ లేవు. నేను మీకు నచ్చితే.. ఆ అమ్మాయికి చక్కటి జోడీ అవుతానని అనిపిస్తే నా నంబర్ 73301-73301కి కాల్ చేయండి. ఇది ఫేక్ కాదు. నా లైఫ్ అని వీడియో ద్వారా తెలిపారు. వెంట‌నే అభిమానులంద‌రు ఆ నంబ‌ర్‌కి కాల్స్ చేయ‌డం మొదలు పెట్టారు. అయితే ఆర్య తాను అమ్మాయి కావాల‌ని అంది రియ‌ల్ మ్యారేజ్ కోసం కాదు. రీల్ మ్యారేజ్‌కోసం. వయాకామ్ 18 అనే సంస్థ ఇటీవల కలర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ చానల్‌ను ప్రారంభించింది. ఇందులో ‘ఇంగవీట్లు మాపిళ్ళై' అనే స్వయంవరం కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు. ఈ షోలో నటుడు ఆర్య పెళ్లికొడుకుగా పాల్గొననుండ‌గా, ఆయ‌న‌తో జోడి క‌ట్టేందుకు 70వేల మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌ట‌. 6 వేల మంది ఆన్‌లైన్‌లో పేర్లు న‌మోదు చేసుకున్నార‌ట‌. మొత్తంగా ఇందులో షార్ట్ లిస్ట్ చేసి ఫైన‌ల్‌గా 18 మందిని ఎంపిక చేశారు. ఏప్రిల్‌లో ప్ర‌సారం కానున్న ఈ షోలో 18 మంది అమ్మాయిల‌తో ఆర్య స్వ‌యంవ‌రం ఉండ‌నున్న‌ట్టు తెలుస్తుంది.