`6టీన్స్` హీరో రోహిత్ `కళాకార్`తో కమ్ బ్యాక్.. గుర్తు పట్టడం కష్టమే
`6టీన్స్ `ఫేమ్ రోహిత్ చాలా గ్యాప్‌తో హీరోగా `కళాకార్` అనే సినిమా చేస్తున్నాడు. శ్రీను బందెల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ ను హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు.
`6టీన్స్` హీరో రోహిత్ చాలా రోజుల తర్వాత మళ్లీ హీరోగా మెరవబోతున్నారు. గతంలో `జానకి వెడ్స్ శ్రీరామ్`, `నేను సీతామాలక్ష్మి`, `శంకర్‌దాదా MBBS`, `నవ వసంతం` వంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో రోహిత్. మధ్యలో సినిమాలకు దూరమయ్యారు. ఇన్నాళ్లకి మళ్లీ సినిమాల్లో మెరవబోతున్నారు. తాజాగా ఆయన హీరోగా `కళాకార్` అనే సినిమా చేస్తున్నాడు. శ్రీను బందెల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఏజీ అండ్ ఏజీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ ను హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, ``కళాకార్` టైటిల్ బాగుంది. అలాగే పోలీస్ ఇన్స్పెక్టర్గా రోహిత్ లుక్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైమ్ రోహిత్‌ను పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో చూస్తున్నా. చాలా ఫిట్‌గా కనిపిస్తున్నారు. వెంకటరెడ్డిగారు నిర్మాతగా శ్రీను బందెల డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా డెఫినెట్‌గా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. రోహిత్ నేను కలిసి ఎప్పటినుండో ఇండస్ట్రీలో ట్రావెల్ చేస్తున్నాము. ఆల్ ది బెస్ట్ టు రోహిత్ అండ్ టీమ్` అన్నారు.
హీరో రోహిత్ మాట్లాడుతూ, ``కళాకార్ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ హీరో శ్రీకాంత్ గారు రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయనతో ఎప్పటినుంచో నాకు మంచి అనుభందం ఉంది. నేను ఫస్ట్ టైమ్ యాక్షన్ అండ్ సస్పెన్స్ సబ్జెక్ట్‌తో చేస్తోన్న చిత్రమిది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది` అని అన్నారు. చిత్ర నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం మాట్లాడుతూ, ``కళాకార్` ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదలచేసిన హీరో శ్రీకాంత్‌గారికి ధన్యవాదాలు. హీరో రోహిత్‌కు పర్ఫెక్ట్ రీ ఏంట్రీ సబ్జెక్ట్ ఇది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ముగింపు దశలో ఉన్నాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం` అని అన్నారు.
దర్శకుడు శ్రీను బందెల మాట్లాడుతూ, `ఈ మూవీతో రోహిత్ ఒక డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తారు. మా నిర్మాత వెంకటరెడ్డిగారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని నిర్మించారు. సినిమా ఔట్పుట్ చాలా బాగా వచ్చింద`న్నారు. ఇందులో షాయాజీ షిండే, పృథ్విరాజ్, రాజీవ్ కనకాల, శివశంకర్, రవికాలే, గగన్, కరాటే కళ్యాణి, జయలలిత, అశోక్‌కుమార్ వంటి ప్రముఖ నటులు కీలకపాత్రల్లో నటించారు. ఇదిలా ఉంటే తాజాగా శ్రీకాంత్‌తో పాటు ఆయన ఫస్ట్ లుక్ సందర్భంగా కనిపించిన లుక్ షాక్ ఇస్తుంది. నెరిసిన గెడ్డంతో గుర్తుపట్టలేనంగా మారిపోయారు.