కొద్ది సేపటి క్రితమే భారత ప్రభుత్వం 69 వ జాతీయ అవార్డులని ప్రకటించింది. ఊహించినట్లుగానే తెలుగు సినిమా జాతీయ అవార్డుల్లో సత్తా చాటింది.
కొద్ది సేపటి క్రితమే భారత ప్రభుత్వం 69 వ జాతీయ అవార్డులని ప్రకటించింది. ఊహించినట్లుగానే తెలుగు సినిమా జాతీయ అవార్డుల్లో సత్తా చాటింది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం వివిధ విభాగాల్లో నేషనల్ అవార్డులు సొంతం చేసుకుంది. ఆస్కార్ నే ఒడిసి పట్టుకున్న ఆర్ఆర్ఆర్ జాతీయ అవార్డులు సాధించడంలో ఆశ్చర్యం లేకపోవచ్చు.
ఇక డెబ్యూ దర్శకుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు సాన తెరకెక్కించిన సంచలన ప్రేమకథా చిత్రం 'ఉప్పెన' ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు సాధించింది. ఈ చిత్రంలో పంజా వైష్ణవ్ తేజ్, కృతి సనన్ అద్భుతమైన కెమిస్ట్రీతో జంటగా నటించారు. ఎమోషనల్ ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన ఉప్పెన అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించింది.
ఇక ఆర్ఆర్ఆర్ చిత్రం వివిధ విభాగాల్లో జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. ఆ జాబితా ఇప్పుడు చూద్దాం.
బెస్ట్ కొరియోగ్రఫీ : ప్రేమ్ రక్షిత్ మాస్టర్ (RRR)
బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ : కింగ్ సోలెమాన్ (RRR)
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ : శ్రీనివాస్ మోహన్ (RRR)
ఉత్తమ సంగీత దర్శకుడు (బ్యాగ్రౌండ్ స్కోర్) : ఎం ఎం కీరవాణి (RRR)
బెస్ట్ మేల్ సింగర్ : కాల భైరవ(RRR- కొమురం భీముడో సాంగ్ )
బెస్ట్ పాపులర్ ఫిలిం : RRR
మొత్తం 6 విభాగాల్లో ఆర్ఆర్ఆర్ చిత్రం జాతీయ అవార్డులు కొల్లగొట్టింది. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ అన్ని విభాగాల్లో ఆర్ఆర్ఆర్ చిత్రం ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇక కీరవాణి ఉత్తమ సంగీత దర్శకుడిగా బ్యాగ్రౌండ్ స్కోర్ విభాగంలో ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను అవార్డు దక్కించుకున్నారు.
ఇక కాలభైరవవ పాడిన కొమురం భీముడొ సాంగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పాటకి గాను కాల భైరవ ఉత్తమ మేల్ సింగర్ గా అవార్డు దక్కించుకున్నారు. ఇక ఉత్తమ నటుడు విభాగంలో రాంచరణ్, ఎన్టీఆర్ లలో ఒకరికి అవార్డు వస్తుందని ఫ్యాన్స్ ఆశించారు. కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ జాతీయ నటుడిగా పుష్ప చిత్రంతో అవార్డు గెలవడం విశేషం.
