69వ జాతీయ అవార్డులో తెలుగు చిత్ర పరిశ్రమ దుమ్మురేపింది. ఏకంగా పది అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ జాతీయ నటుడిగా అల్లు అర్జున్ నిలవగా, అధికంగా `ఆర్‌ఆర్‌ఆర్`కి ఆరు జాతీయ అవార్డులు దక్కాయి.
69వ జాతీయ అవార్డుల ప్రకటన వచ్చింది. 2021-22 ప్రారంభంలో వచ్చిన చిత్రాలకు గానూ ఈ జాతీయ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో తెలుగు చిత్ర పరిశ్రమ సంచలనం సృష్టించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. `ఆర్‌ఆర్‌ఆర్` అత్యధికంగా ఆరు అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడిగా బన్నీ రికార్డు క్రియేట్ చేశారు. `పుష్ప` చిత్రానికి గానూ ఆయనకు జాతీయ అవార్డు వరించింది. తెలుగు నటుల్లో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు పొందిన తొలి, ఏకైక నటుడిగా రికార్డు క్రియేట్ చేశారు. టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించారు. మ్యూజిక్ విభాగంలోనూ ఈ సినిమాకి అవార్డు రావడం విశేషం. తెలుగు ఉత్తమ జాతీయ చిత్రంగా `ఉప్పెన` నిలవగా, ఆస్కార్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్‌కి `కొండపొలం` చిత్రానికిగానూ జాతీయ అవార్డు వరించింది.
ఇక `ఆర్‌ఆర్‌ఆర్`కి అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కొరియోగ్రాఫర్, యాక్షన్, గాయకుడు, స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో నేషనల్ అవార్డులు దక్కాయి. ఇక `పుష్ప`కి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌తోపాటు ఉత్తమ సంగీతం పాట విభాగంలో దేవిశ్రీ ప్రసాద్ జాతీయ అవార్డుని సొంతం చేసుకున్నారు. వీరితోపాటు హిందీలో `సర్దార్ ఉద్దమ్ సింగ్`, `గంగూబాయి కథియవాడి` చిత్రాలకు ఎక్కువ అవార్డులు వరించాయి. ఉత్తమ నటిగా అలియాభట్, కృతి సనన్ పంచుకున్నారు. అలియాభట్ `గంగూబాయి కథియవాడి`కి, కృతి సనన్ `మిమి` చిత్రానికిగానూ ఈ అవార్డు దక్కింది. ఉత్తమ సినిమాగా `రాకెట్రీ`కి జాతీయ అవార్డు వరించింది.
69వ జాతీయ అవార్డుల జాబితా..
ఉత్తమ చిత్రంః రాకెట్రీ(తమిళం)
ఉత్తమ దర్శకుడుః నిఖిల్ మహరాజ్(గోదావరి-మరాఠి)
ఉత్తమ నటుడుః అల్లు అర్జున్( పుష్ప)-తెలుగు
ఉత్తమ నటిః అలియాభట్(గంగూబాయి కథియవాడి)-కృతి సనన్(మిమి)-హిందీ
ఉత్తమ సహాయ నటిః పల్లవి జోషి(ది కాశ్మీర్ ఫైల్స్- హిందీ)
ఉత్తమ సహాయ నటుడుః పంకజ్ త్రిపాఠి(మిమి-హిందీ)
ఉత్తమ సాంగ్ కొరియోగ్రాఫర్‌ః ప్రేమ్ రక్షిత్ మాస్టర్(ఆర్‌ఆర్‌ఆర్-తెలుగు)
ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీః కింగ్ సోలోమన్(ఆర్‌ఆర్‌ఆర్- తెలుగు)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ః వి శ్రీనివాస్ మోహన్(ఆర్‌ఆర్‌ఆర్-తెలుగు)
ఉత్తమ పాట రచయితః చంద్రబోస్(ధమ్‌ధమ్‌ధమ్- కొండపొలం-తెలుగు)
ఉత్తమ సంగీతం(సాంగ్)ః దేవిశ్రీ ప్రసాద్(పుష్ప-తెలుగు)
ఉత్తమ సంగీతం(బీజీఎం)ః కీరవాణి(ఆర్‌ఆర్‌ఆర్-తెలుగు)
ఉత్తమ గాయకుడుః కాళభైరవ(ఆర్‌ఆర్‌ఆర్-కొమురం భీముడో)-తెలుగు
ఉత్తమ నేపథ్య గాయనిః శ్రేయ ఘోషల్(ఇరివిన్ నిజాల్-మాయావా ఛాయావా)
ఉత్తమ స్క్రీన్‌ప్లేః నాయట్టు(మలయాళం)
ఉత్తమ సంభాషణలుః గంగూభాయి కథయవాడి(హిందీ)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ః `సర్దార్ ఉద్దమ్`(అవిక్ ముఖోపాధ్యాయ- హిందీ)
ఉత్తమ ఎడిటింగ్‌ః సంజయ్ లీలా భన్సాలీ(గంగూబాయి కథియవాడి)
ఉత్తమ బాలల చిత్రంః `గాంధీ అండ్ కో`(గుజరాతీ)
ఉత్తమ బాల నటుడుః భావిన్ రబారి(ఛల్లో షో-గుజరాతీ)
ఉత్తమ పర్యావరణ పరిరక్షణ చిత్రంః ఆవసవ్యుహాం(మలయాళం)
స్పెషల్ జ్యూరీ అవార్డుః `షేర్షా(విష్ణు వర్థన్-హిందీ)
అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాః `ఆర్‌ఆర్‌ఆర్`(తెలుగు)
ఉత్తమ మేకప్‌ః ప్రీతి శీల్ సింగ్ డిసౌజా(గంగూబాయి కథియవాడి-హిందీ)
ఉత్తమ కాస్ట్యూమ్స్ః వీర్ కపూర్(సర్దార్ ఉద్దమ్ సింగ్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్‌ః `సర్దార్ ఉద్దమ్ సింగ్(దిమిత్రి మలిచ్, మన్సి ధ్రువ్ మెహతా)
ఉత్తమ ఆడియోగ్రఫీ(సౌండ్ డిజైనింగ్)ః అనీష్ బసు(చైవిట్టు-మలయాళం)
ఉత్తమ ఆడియోగ్రఫీ(రీ రికార్డింగ్)ః సినోయ్ జోసెఫ్(ఝిల్లి డిస్కర్డ్స్-బెంగాలీ)
ఉత్తమ క్రిటిక్‌ః పురుషోత్తమ చార్యులు(తెలుగు)
ఉత్తమ తెలుగు సినిమాః `ఉప్పెన`(బుచ్చిబాబు)
ఉత్తమ హిందీ సినిమాః `సర్దార్ ఉద్దమ్`
ఉత్తమ తమిళ సినిమాః `కడైసి వివసాయి`
ఉత్తమ కన్నడ సినిమాః 777 ఛార్లీ
ఉత్తమ మలయాళ సినిమాః హోమ్
ఉత్తమ గుజరాతీ సినిమాః ఛెల్లో షో
ఉత్తమ మరాఠి సినిమాః ఎక్దా కాయ్ జాలా
ఉత్తమ బెంగాలీ సినిమాః కాల్కోఖో
ఉత్తమ అస్సామీ సినిమాః అనుర్
ఉత్తమ ఓడియా సినిమాః ప్రతిక్ష్య
ఉత్తమ మైతిలి సినిమాః సమనంతార్
ఉత్తమ మిషింగ్ సినిమాః బూంబా రైడ్
ఉత్తమ మైటెలాన్ సినిమాః ఈఖోయింగి యుమ్
ఈ సారి 31 విభాగాల్లో జాతీయ అవార్డులను అందించారు. దీనికి 281 సినిమాలు దీనికి పోటీపడ్డాయి.
