68వ జాతీయ అవార్డుల ప్రకటన వచ్చేసింది. 2020-21కిగానూ విడుదలైన సినిమాలకు ఇచ్చే అవార్డుల ప్రకటన వచ్చేసింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు వెల్లడించింది. 

68వ జాతీయ అవార్డుల ప్రకటన వచ్చేసింది. 2020-21కిగానూ విడుదలైన సినిమాలకు ఇచ్చే అవార్డుల ప్రకటన వచ్చేసింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు వెల్లడించింది. ఇప్పటి వరకు 67జాతీయ జాతీయ అవార్డులను అందించారు. అయితే కరోనా కారణంగా ఈ సారి జాతీయ అవార్డుల ప్రకటన ఆలస్యమయ్యింది. 

ఐదు కేటగిరిలో నేషనల్‌ అవార్డులను ప్రకటించారు. ఇందులో దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు, ఫీచర్‌ ఫిల్మ్, నాన్‌ఫీచర్‌ఫిల్మ్, బెస్ట్ రైటింగ్‌, బెస్ట్ ఫ్రెండ్లీ స్టేట్‌ అనే కేటగిరిలో అవార్డులను అందిస్తున్నట్టు అవార్డు కమిటీ వెల్లడించింది. ఇందులో ఫ్రెండ్లీ స్టేట్‌ అవార్డుల్లో మధ్య ప్రదేశ్‌ నిలవడం విశేషం. ఇక ఫీచర్‌ ఫిల్మ్స్ లో ఈ సారి 30 భాషలకు చెందిన 305 సినిమాలు అవార్డులకు పోటీ పడ్డాయని తెలిపారు.

2020-2021లో విడుదలైన చిత్రాలకు గానూ అందించిన జాతీయ అవార్డుల్లో తమిళ సినిమా `సూరారైపోట్రు`(ఆకాశం నీ హద్దురా) ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా మొత్తంగా ఐదు అవార్డులు అందుకోగా, ఉత్తమ నటుడిగా సూర్యతోపాటు బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్(తానాజీ) అందుకున్నారు. ఉత్తమ నటిగా `సూరారై పోట్రు`లో నటించిన అపర్ణ బాలమురళి జాతీయ అవార్డుని అందుకోవడం విశేషం.

జ్యూరి చైర్మెన్‌ విపుల్‌ అమృతలాల్‌ షా సారథ్యంలోని జ్యూరి ఫీచర్ ఫిల్మ్స్ ని ప్రకటించారు. ఫీచర్‌ ఫిల్మ్స్ లో జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా `కలర్‌ఫోటో` నిలిచింది. అలాగే ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎస్‌ఎస్‌ థమన్‌ (అలా వైకుంఠపురములో) చిత్రానికి గానూ అవార్డుని అందుకున్నారు. దీంతోపాటు మేకప్‌ ఆర్టిస్ట్ విభాగంలో `నాట్యం` చిత్రానికి పనిచేసిన టీవీ రాంబాబుకి అవార్డు దక్కడం విశేషం. మొత్తంగా తెలుగుకి నాలుగు అవార్డులు దక్కాయి. ఇక ఎనిమిది అవార్డులతో తమిళం ముందు వరుసలో ఉంది. మలయాళంకి ఏడు జాతీయ అవార్డులు దక్కాయి. స్పెషల్‌ మెన్షన్‌తో కలిపి ఎనిమిది అవార్డులు దక్కడం విశేషం. మరాఠికి ఆరు అవార్డులు దక్కాయి.

కాగా తెలుగు నుండి ఫీచర్చ్ విభాగంలో కలర్ ఫోటో అవార్డు దక్కించుకుంది. సందీప్ రాజ్ దర్శకత్వంలో సుహాస్, చాందిని చౌదరి హీరో హీరోయిన్స్ గా కలర్ ఫోటో తెరకెక్కింది. ఆహాలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కగా సునీల్ విలన్ రోల్ చేశారు. కమెడియన్ సుహాస్ ఈ మూవీతో హీరోగా మారడం జరిగింది. సాయి రాజేష్, బన్నీ ముప్పనేని నిర్మాతలుగా ఉన్నారు. ఇక కలర్ ఫోటో జాతీయ అవార్డు అందుకున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

68వ జాతీయ అవార్డుల జాబితాః 

జాతీయ ఉత్తమ చిత్రంః సూరారైపోట్రు(తమిళం)

ఉత్తమ నటుడుః సూర్య(సూరారై పోట్రు), అజయ్‌ దేవగన్‌(తానాజీ).

ఉత్తమ నటిః అపర్ణ బాలమురళి(సూరారై పోట్రు-తమిళం)

ఉత్తమ సహాయ నటుడుః బీజూ మీనన్‌(అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌-మలయాళం)

ఉత్తమ సహాయ నటిః లక్ష్మీ ప్రియా చంద్రమౌళి(శివ రంజినీయుము ఇన్నుమ్‌ సిలా పెంగలుమ్‌-తమిళం)

ఉత్తమ దర్శకుడుః సచ్చిదానందమ్ కేఆర్‌(అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌-మలయాళం)

బెస్ట్ పాపులర్‌ ఫిల్మ్ః తానాజీ( హిందీ)

ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్ః టీవీ రాంబాబు(నాట్యం-తెలుగు)

బెస్ట్ కొరియోగ్రఫీః సంధ్యారాజు(నాట్యం - తెలుగు)

ఉత్తమ సంగీత దర్శకుడుః ఎస్ఎస్ థమన్‌(అల వైకుంఠపురములో-తెలుగు) 

ఉత్తమ నేపథ్యం సంగీతంః జీవీ ప్రకాష్ కుమార్(సూరారై పోట్రు-తమిళం)

బెస్ట్ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ః నచికేట్‌ బర్వే, మహేష్‌ షేర్లా(తానాజీ-హిందీ)

బెస్ట్ లిరిక్‌ః సైనా(మనోజ్‌ మౌతషిర్‌-హిందీ)

బెస్ట్ యాక్షన్‌ డైరెక్షన్‌ః అయ్యప్పనుమ్‌ కోషియుము(రాజశేఖర్, మాఫియా శశి, సుప్రీమ్‌ సుందర్‌-మలయాళం)

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్‌ః కప్పెలా(అనీష్‌ నదోడి- మలయాళం)

బెస్ట్ ఎడిటింగ్‌ః శ్రీకర్‌ ప్రసాద్‌( శివరంజనియుమ్‌ ఇన్నుమ్‌ శిలా పెంగలుమ్‌-తమిళం)

బెస్ట్ ఆడియోగ్రఫీ(లోకేషన్‌ సౌండ్‌ రికార్డింగ్‌)ః డోలు(జోబిన్‌ జయన్‌-కన్నడ)

బెస్‌ సౌండ్‌ డిజైన్‌ః మి వసంత్రావ్‌(అన్మోల్‌ భావే-మరాఠి)

రీరికార్డిస్ట్ ఫైనల్‌ మిక్సింగ్‌ః మాలిక్‌(విష్ణు గోవింద్‌, శ్రీ శంకర్‌_మలయాళం)

బెస్ట్ స్క్రీన్‌ ప్లే రైటర్‌ః సూరారై పోట్రు(శాలిని ఉషా నాయర్‌ః సుధా కొంగరా-తమిళం)

బెస్ట్ స్క్రీన్ ప్లై డైలాగ్‌ః మండేలా(మడెన్నే అశ్విన్‌-తమిళం)

బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌ః అవిజాత్రిక్‌(సుప్రతిమ్ భోల్‌-బెంగాలీ)

బెస్ట్ ఫీమేల్‌ సింగర్‌ః నంచమ్మ (అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌-మలయాళం)

బెస్ట్ మేల్‌ సింగ్‌ః రాహుల్ దేశ్‌ పాండే(మీ వసంత్రావ్‌-మరాఠి)

బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ః అనీష్‌ మంగేష్‌ గోసావే(తక్‌ తక్‌-మరాఠి)

జాతీయ ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రాలుః 
తెలుగుః కలర్‌ ఫోటో
తమిళంః శివరంజనియుమ్‌ ఇన్ను శిలా పెంగలుమ్‌
మలయాళంః థింకలజచై నిశ్చయమ్‌
మరాఠిః గోస్తా ఎకా పైథనిచి
కన్నడః డోలు
హిందీః తులసీదాస్‌ జూనియర్‌
అస్సామిః బ్రిడ్జ్
బెంగాలీః అవిజత్రిక్‌
తులుః జీతిగే
డిమసాః సేంఖార్‌
హర్యన్విః దాదా లక్మి

బెస్ట్ బుక్‌ ఆఫ్‌ సినిమాః `ది లాంగేస్ట్ కిస్‌`(కిశ్వర్‌ దేశాయ్‌)
బెస్ట్ బుక్‌ ఆఫ్‌ సినిమా(స్పెషల్‌ మెన్షన్‌)ః ఎంఐటీ అనుభవంగలుడే పుస్తకమ్‌, కలి పైనీ కలిరా సినిమా

స్పెషల్‌మెన్షన్‌ః నటి అయిమీ బరువా, మలయాళ చిత్రం `వంకు`, `జూన్‌` అనే మరాఠి చిత్రానికిగానూ సిద్ధార్థ్‌ మీనన్‌లకు, అలాగే కిశోర్‌ కడమ్‌ అనే మరాఠి నటుడికి, బాలనటుడు వరుణ్‌ బుద్దాదేవ్‌(తులసీదాస్‌ జూనియర్‌) స్పెషల్‌ మెన్షన్‌ అవార్డులు దక్కాయి. 

నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌ అవార్డుల జాబితాః 

బెస్ట్ వాయిస్‌ ఓవర్‌(నరేషన్‌)ః శోభ థరూర్‌ శ్రీనివాసన్(రాప్సోడీ ఆఫ్‌ రెయిన్స్‌ః మాన్‌సూన్‌ ఆఫ్‌ కేరళా(ఇంగ్లీష్‌)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్‌ః విశాల్‌ భరద్వాజ్‌(1232 కిలోమీటర్స్ః మారంగే తోహ్‌ వాహిన్‌ జాకర్‌)
బెస్ట్ ఎడిటింగ్‌ః ఆనంది అథ్లే(బార్డర్‌ల్యాండ్స్)
బెస్ట్ ఆన్‌ లోకేషన్‌ సౌండ్‌(సింక్‌ సౌండ్‌)ః సందీప్‌ భటి, ప్రదీప్‌ లేఖ్వార్‌(జడుయ్‌ జంగల్‌ ఫర్‌ మ్యాజికల్‌ ఫారెస్ట్)
బెస్ట్ ఆడియోగ్రఫీః అజిత్‌ సిన్హా రాథోర్‌, పీయర్ల్ ఆఫ్‌ ది డీసెర్ట్(రాజస్థాని)
బెస్ట్ సినిమాటోగ్రఫీః నిఖిల్‌ ప్రవీణ్‌(శబ్దిక్కున్నా కలప్పా)
బెస్ట్ డైరెక్షన్‌ః `ఓహ్‌ ధట్స్‌ భాను`(ఇంగ్లీష్‌, తమిళం, మలయాళం, హిందీ)
బెస్ట్ ఫ్యామిలీ వ్యాల్యూస్‌ ఫిల్మ్ః కుంకుమర్చన(మరాఠి)
బెస్ట్ షార్ట్ ఫిక్షన్‌ ఫిల్మ్ః `కచిచినితు`
స్పెషల్‌జ్యూరీ అవార్డులుః `అడ్మిటెడ్‌`(ఓజస్వీ శర్మ-హిందీ, ఇంగ్లీష్‌)
బెస్ట్ ఇన్వెస్టిగేషన్‌ ఫిల్మ్ః ది సేవియర్‌ః `బ్రిగ్‌`(ప్రీతమ్ సిన్హా-పంజాబి)
బెస్ట్ అడ్వెంచర్ ఫిల్మ్ః `వీలింగ్‌ ది బాల్‌`(ఇంగ్లీష్‌, హిందీ)
బెస్ట్ ఎడ్యూకేషనల్‌ ఫిల్మ్ః `డ్రీమింగ్‌ ఆఫ్‌ వర్డ్స్`(మలయాళం)
బెస్ట్ సోషల్‌ ఇష్యూ ఫిల్మ్ః `జస్టిస్‌ డిలే బట్‌ డెలివర్డ్‌`, `త్రీ సిస్టర్స్(బెంగాలీ)
బెస్ట్ ఎన్విరాన్‌మెంట్ ఫిల్మ్ః `మనాహ అరు మనుహ్‌`(అస్సామీస్‌)
బెస్ట్ ప్రొమోషనల్‌ ఫిల్మ్ం `సర్‌మౌంటింగ్‌ ఛాలెంజెస్‌`(ఇంగ్లీష్‌)
బెస్ట్ సైన్స్ అండ్‌ టెక్నాలజీ ఫిల్మ్ః `ఆన్‌ ది బ్రింక్‌ సీజన్‌ 2-బ్యాట్స్(ఇంగ్లీష్‌)
బెస్ట్ ఆర్ట్స్ అండ్ కల్చర్‌ ఫిల్మ్ః `నాడడ నవనీత` (పీటీ వెంకటేష్‌ కుమార్)
బెస్ట్ బయోగ్రాఫికల్‌ ఫిల్మ్ః పబుంగ్‌ శ్యామ్‌(మణిపురి)
బెస్ట్ ఎథ్నోగ్రాఫిక్‌ ఫిల్మ్ః మండల్‌ కే బోల్‌(హిందీ)
బెస్ట్ డెబ్యూట్‌ నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్ ఆఫ్‌ ఏ డైరెక్టర్‌ః పరియా(మరాఠి, హిందీ)
బెస్ట్ నా ఫీచర్‌ ఫిల్మ్ః `టెస్టోమోనీ ఆఫ్‌ అనా`