ప్రముఖ తమిళ నటి, బీజేపీ నాయకురాలు  జయలక్ష్మీపై  పోలీస్ కేసు నమోదు అయ్యింది.  పోలీసులు ముందు హాజరు కావాలంటూ ఆమెకు సమాన్లు జారీ చేసింది కోర్ట్. ఇంతకీ ఆమె ఏం క్రైం చేసింది..? ఎందుకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది..?

ప్రముఖ నటి, బీజేపీ కార్యదర్శి జయలక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో పోలీసుల ముందు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేశారు. ఓ ఫౌండేషన్ పేరుతో నటి జయలక్ష్మి డబ్బు వసూలు చేస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటోంది ఆమె. ఓ గీత రచయిత స్థాపించిన ఫౌండేషన్ పేరును జయలక్ష్మీ ఉపయోగించుకుని భారీగా వసూళ్ళుకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఒక మంచి పని చేస్తున్న ఫౌండేషన్ ను ఉపయోగించుకుని నటి విజయలక్ష్మి సొమ్ము చేసుకుంటున్నారంటూ ఆరోపించారు. ఇదే విషయంపై గీత రచయిత కోర్టుకెక్కగా.. ఆధారాలు ఉంటే నటిపై కేసు నమోదు చేయాలంటూ తీర్పు వెలువరించింది. 

వెంటనే తిరుమంగళం పోలీసులు విచారణ జరిపి నటి విజయలక్ష్మిపై కేసు నమోదు చేశారు. పోలీస్ విచారణకు హాజరు కావాలంటూ స్ట్రీక్ట్ గా ఆర్డర్ పాస్ చేశారు. అసలు వివరాలగురించి తెలియాలంటే.. చెన్నైలోని ఇరుబాక్కం వెంకటేశ్ నగర్ లో ఉంటున్న ప్రముఖ గేయ రచయిత స్నేహన్ ఓ ఫౌండేషన్ ని స్థాపించారు. 2015లో స్టార్ట్ చేసిన ఈ సంస్థకు తన పేరు కలిసివచ్చేలా స్నేహం ఫౌండేషన్ అని పేరుకూడా పెట్టారు. ఈ ట్రస్ట్ పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు స్నేహన్. అయితే తమ ట్రస్ట్ పేరుతో నటి జయలక్ష్మీ వసూళ్లు చేస్తోందంటూ ఆయన రీసెంట్ గా ఓ కేస్ ను పెట్టారు. 

 ఈ ట్రస్టు పేరుని ఉపయోగించుకుని నటి జయలక్ష్మి డబ్బు వసూలు చేస్తున్నట్లు స్నేహన్ దృష్టికి వచ్చినట్లు తెలిపాడు. స్నేహన్, నటి జై లక్ష్మీభాయి ఆగస్టు 5న చెన్నై పోలీసు కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న విజయలక్ష్మి స్నేహన్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అంటూ అతనిపై రివర్స్ లో మరో కేసు పెట్టారు. దాంతో ఆమె రివర్స్ కంప్లైట్ పెట్టి కన్ ఫ్యూజన్ లో పెట్టడంతో స్నేహన్ మద్రాస్ కోర్డ్ ను ఆశ్రయించాడు. 

తన ట్రస్టు పేరుతో విజయలక్ష్మి వసూళ్లకు పాల్పడుతోందని తగిన విచారణ జరిపి ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ కోరాడు. గేయ రచయిత స్నేహన్ వాదన విన్న హైకోర్టు తగిన విచారణ జరిపి.. ఆధారాలు ఉంటే నటి విజయలక్ష్మిపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో తిరుమంగళం పోలీసులు నటి విజయలక్ష్మిపై ఐపీసీ సెక్షన్ 420, 465 కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసు విచారణకు హాజరు కావాలంటూ సమన్లు కూడా జారీ చేశారు.