Asianet News TeluguAsianet News Telugu

మహానాయకుడికి పోటీగా బూతు సినిమా?

టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన నందమూరి తారక రామారావు గారి బయోపిక్ ఫస్ట్ పార్ట్ కథానాయకుడు ఎలాంటి టాక్ ను తెచ్చుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు ఆ సినిమాకు కొనసాగింపుగా సెకండ్ పార్ట్ మహానాయకుడు రిలీజ్ కు సిద్ధమవుతోంది. మొత్తానికి ప్రీ రిలీజ్ బిజినెస్ ను పూర్తి చేసి ఈ నెల 22న విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. 

4 movies release on feb 22
Author
Hyderabad, First Published Feb 15, 2019, 3:35 PM IST

టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన నందమూరి తారక రామారావు గారి బయోపిక్ ఫస్ట్ పార్ట్ కథానాయకుడు ఎలాంటి టాక్ ను తెచ్చుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు ఆ సినిమాకు కొనసాగింపుగా సెకండ్ పార్ట్ మహానాయకుడు రిలీజ్ కు సిద్ధమవుతోంది. మొత్తానికి ప్రీ రిలీజ్ బిజినెస్ ను పూర్తి చేసి ఈ నెల 22న విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. 

అయితే అదే రోజులు మరో మూడు సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. మెయిన్ గా బోల్డ్ కంటెంట్ తో ఉన్న చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమా కొంచెం భారీ అంచనాలతోనే రాబోతోంది. ఎందుకంటే సినిమాకు సంబందించిన ట్రైలర్ చేసిన రచ్చ మాములుగా లేదు. ఇప్పటికి యువత లో సినిమా ట్రైలర్ హాట్ టాపిక్ గా మారుతోంది. చాలా స్పీడ్ గా ట్రైలర్ 3 మిలియన్ వ్యూప్స్ ని దాటేసి అంచనాలను పెంచేసింది. 

డబుల్ మీనింగ్ డైలాగులతో హాట్ సీన్స్ గట్టిగా ఉండడంతో ఓ వర్గం వారిని బాగా ఆకర్షిస్తున్న ఈ సినిమా ఎన్టీఆర్ బయోపిక్ కు పోటీగా వస్తోంది అని కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. మహానాయకుడు సినిమాపై చెడు గాలిని ఓ వర్గం వారు బాగా స్ప్రెడ్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇక సినిమా ఫస్ట్ పార్ట్ ఫెయిల్ అవ్వడం మహానాయకుడుకి నెగిటివ్ పాయింట్ అని చెప్పాలి. దానికి తోడు ఇప్పుడు బూతు సినిమాపై కుర్రకారు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మహానాయకుడు పోలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఎలా ఉంటుంది అనేది సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. 

సినిమాలో కాంట్రవర్సీ ఎక్కువగా ఉండదు అని నిజాలను కరెక్ట్ గా చూపించరని అందరూ చెబుతున్నదే అయినా సినిమా వచ్చే వరకు ఏది నమ్మలేము. ఇక మహానాయకుడు సినిమా ఎంతవరకు బాక్స్ ఆఫీస్ వద్ద నిలదొక్కుకుంటుందో చూడాలి. ఈ రెండు సినిమాలతో పాటు మిఠాయి - 4 లెటర్స్ అనే మరో రెండు డిఫరెంట్ జానర్ సినిమాలు కూడా ఫిబ్రవరి 22న రిలీజ్ కాబోతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios