గత ఏడాది బాలీవుడ్ లో వీరే ది వెడ్డింగ్ అనే సినిమా ఒకటి వచ్చింది. ఆ సినిమాలో నటించింది నాలుగురు హీరోయిన్స్. అందరూ బోల్డ్ స్టయిల్లో ఆడియెన్స్ ను బాగానే ఎట్రాక్ట్ చేశారు. అయితే ఇప్పుడు అదే తరహాలో టాలీవుడ్ కి కొత్త టచ్ అవ్వడానికి నాలుగు అమ్మాయిలు రెడీ అయ్యారు. వారు మోడ్రన్ గా కనిపిస్తు.. పోజులివ్వడం చూస్తుంటే ఎదో రచ్చ చేసేలా ఉన్నారని పిస్తోంది.

  

అదే విధంగా సెక్సీ కత్తుల్లా ఉన్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో హాటు ఘాటు అందాలతో ఆడియెన్స్ గుండెలను ఏ విధంగా పొడుస్తారో అనే ఆలోచనను కలిగిస్తోంది. ఒక హీరోయిన్ అయితే ఏకంగా మిడిల్ ఫింగర్ తో ఎదో ఘాటునే రేపుతోంది.  ఫుల్ ఫన్ గా సాగే ఈ సినిమాలో సూర్య vs సూర్య బ్యూటీ త్రిదా చౌదరితో తో పాటు ధాన్య బాలకృష్ణ - సిద్ధి ఇడ్నాని అలాగే కోమలి ప్రసాద్ సినిమాలో నటిస్తున్నారు. 

ఇక ఈ రోజు సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి మే నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. రఘు కుంచె చాలా రోజుల తరువాత మళ్ళీ ఈ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ గా బిజీ కానున్నాడు.