స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం 30రోజుల్లో ప్రేమించడం ఎలా?. నేడు ఈ చిత్ర ట్రైలర్ టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ విడుదల చేశారు. కాగా యూత్ ఫుల్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన 30రోజుల్లో ప్రేమించడం ఎలా? ట్రైలర్ ఆకట్టుకుంది. రొమాన్స్ అండ్ కామెడీ కలగలిపి యూత్ కి కావలసిన అంశాలతో తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. 

ఇక పునర్జనమ నేపథ్యంలో ఎమోషనల్ అంశాలు కూడా ఈ చిత్రంలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఆడియో విశేష ఆదరణ దక్కించుకుంది. స్టార్ సింగర్ సిధ్ శ్రీరామ్ పాడిన నీలి నీలి ఆకాశం సాంగ్... యూత్ ని ఒక ఊపు ఊపింది. 
కాగా ఈ మూవీ జనవరి 26న విడుదల కానుంది. ట్రైలర్ లో చిత్ర విడుదలపై ప్రకటన విడుదల చేశారు చిత్ర బృందం. 2020లోనే ఈ మూవీ విడుదల కావాల్సి ఉంది. లాక్ డౌన్ నేపథ్యంలో వాయిదా పడింది. దర్శకుడు మున్నా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిచడం జరిగింది.