దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తోన్న 'RRR' సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.

దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో హీరోల ఇంట్రడక్షన్ సాంగ్ కోసం దర్శకుడు రాజమౌళి మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించడానికి సిద్ధమవుతున్నాడట. 

రామోజీఫిలిం సిటీలో భారీగా సెట్ ను నిర్మించి ఈ పాటను చిత్రీకరించబోతున్నారు. ఈ పాట ఇద్దరు హీరోల పాత్రలను, స్వాతంత్య్రం కోసం వారు పడ్డ కష్టాలను వివరిస్తూ  సాగుతుందట. ఈ ఒక్క పాట ప్రొడక్షన్ కాస్ట్ మూడు కోట్లకు దగ్గరగా ఉంటుందని చెబుతున్నారు.

ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ని ఫైనల్ చేసిన తరువాత ఈ పాటను చిత్రీకరిస్తారట. డివివి దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.