తెలుగు చిత్ర పరిశ్రమ అంటే బాహుబలి కి ముందు ఒక లెక్క బాహుబలి తరువాత మరో లెక్క అన్నట్లుగా మారిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బడ్జెట్ లో అయినా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లో అయినా.. అదే విధంగా కంటెంట్ లో అయినా బాలీవుడ్ కి తీసిపోని విధంగా బాహుబలి ఆకర్షించింది. 

అయితే ఇప్పుడు కోలీవుడ్ నుంచి 2.0 కూడా అదే రేంజ్ లో విడుదల కానుంది. అయితే రిలీజ్ కు ముందు అన్ని విషయాల్లో బాహుబలి కంటే 2.0 చాలా పెద్దదని చెప్పవచ్చు. 400కోట్లకు పైగా బడ్జెట్ - యాక్టర్స్ ఇలా ప్రధాన అంశాలు సినిమాకు ప్లస్ పాయింట్ ఇక అసలైన కంటెంట్ అనేది రిలీజ్ తరువాత తెలుస్తుంది. 

ఇకపోతే 2.0 సినిమా బాహుబలి కంటే హై రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. 3డి విజువల్ వండర్ కావడంతో చాలా వరకు థియేటర్స్ సినిమా కోసం స్పెషల్ గా సిద్దమయ్యయి. ఇక దేశవ్యాప్తంగా మరికొన్ని థియేటర్స్ 4డి సౌండ్ తో సిద్దమయ్యయి. ప్రపంచ వ్యాప్తంగా 6800 థియేటర్స్ లో (పదివేలకు పైగా స్క్రీన్స్ లలో) లో సినిమా విడుదల కానుంది. 

ఇక బాహుబలి గత ఏడాది 6500 థియేటర్స్ లలో రిలీజయ్యింది. తెలుగులో అయితే 2.0 సినిమా 70 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తమిళ్ లో కంటే తెలుగు రాష్ట్రాల్లోనే సినిమా ఎక్కువ స్క్రీన్స్ లలో రిలీజ్ కాబోతోంది. మరి నవంబర్ 29న రిలీజ్ కానున్న శంకర్ 2.0 ఏ స్థాయిలో హిట్టవుతుందో చూడాలి.