2.0పై కొంత నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ అభిమానులకు మాత్రం మంచి కిక్ ఇచ్చింది. గ్లోబల్ మెస్సేజ్ ఉండటంతో చాలా వరకు ఓ వర్గం వారికి సినిమా బాగా కనెక్ట్ అయ్యింది. ఇకపోతే సినిమా కలెక్షన్స్  ఇండియాలో బాగానే ఉన్నా మొదటి రోజు యూఎస్ లో మాత్రం అనుకున్నంత రేంజ్ లో రాలేవు. 

ఇక రీసెంట్ గా అందిన సమాచారం ప్రకారం శనివారం ఊహించని విధంగా మంచి కలెక్షన్స్ ను అందించింది. అసలైతే బుధవారం ప్రీమియర్స్ తో కలుపుకొని శుక్రవారం వరకు సినిమా $1.6 మిలియన్ డాలర్స్ ను మాత్రమే రాబట్టగలిగింది. ప్రమోషన్స్ పెద్దగా చేయకపోవడం టికెట్స్ రేట్స్ అధికంగా ఉండటం ఓపెనింగ్స్ పై కొంత దెబ్బేసింది. 

ఇక శనివారం మాత్రం విమర్శకులకు చెక్ పెట్టె విధంగా సినిమా మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. శనివారం వరకు 286 లొకేషన్స్ లో మొత్తంగా సినిమా 2.83 మిలియన్ల డాలర్లను అందుకున్నట్లు తెలుస్తోంది. అంటే నిన్న ఒక్కరోజే సినిమా $1 మిళియన్స్ కు పైగా రాబట్టడం చూస్తుంటే వీకెండ్ కి సినిమా యూఎస్ లో $4 మిలియన్స్ ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు. మరి శంకర్ విజువల్ వండర్ ఇదేతరహాలో ముందుకు వెళుతుందో లేదో చూడాలి.