శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ విజువల్ వండర్ 2.0 ఓపెనింగ్స్ లో కొంచెం తడబడినా వీకెండ్ కి వచ్చే సరికి మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది. అక్షయ్ కుమార్ పాత్ర సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలువగా రజినీకాంత్ 3.0 అంటూ ప్రత్యేకంగా ఆకట్టుకున్నాడు. ఇకపోతే సినిమా బాలీవుడ్ లో కూడా మంచి వసూళ్లనే రాబడుతోంది. 

మొదటి మూడురోజుల్లో సినిమా శనివారం వరకు చూసుకుంటే హిందీలో 63 కోట్లను రాబట్టినట్లు సమాచారం. ఇక ఆదివారం కూడా సినిమా హౌస్ ఫీల్ కలెక్షన్స్ ను రాబట్టే అవకాశం ఉంది. ఇక త్వరలోనే చిత్ర యూనిట్ సక్సెస్ ఈవెంట్ తో సెలబ్రేషన్స్ స్టార్ట్ చేయాలనీ అనుకుంటోంది. చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అందుకు సంబందించిన సన్నాహకాలు కు సిద్దమవుతున్నట్లు సమాచారం. 

తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా కలెక్షన్స్ స్టడీగానే ఉన్నాయి. అయితే బిసి సెంటర్స్ లో 2డికి ఎక్కువగా ఆదరణ అందడం లేదు. 3డిలోనే సినిమాను చూడటానికి ఆడియెన్స్ ఇష్టపడుతున్నారు. ఇక రేపటి వసూళ్లతో సినిమా అసలు ఏ స్థాయిలో కలెక్షన్స్ ను అందుకుంటుంది అనే దానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.