Asianet News TeluguAsianet News Telugu

ఛస్...('24 కిస్సెస్' మూవీ రివ్యూ )

'మిణుగురులు'  వంటి సామాజిక సందేశం ఉన్న  చిత్రంతో  అవార్డ్ లు పొందిన దర్శకుడు రెండో చిత్రం అంటే ...అందరి మాటా ఏమో కానీ కొందరికైనా కొన్ని అంచనాలు ఉంటాయి. అయితే వారి అంచనాలు తలకిందులు చేస్తూ...  కమర్షియల్ టైటిల్, కమర్షియల్ హీరోయిన్ ని పెట్టి టీజర్ వదిలారు. 

24 kisses movie telugu review
Author
Hyderabad, First Published Nov 23, 2018, 1:09 PM IST

--సూర్య ప్రకాష్ జోశ్యుల

'మిణుగురులు'  వంటి సామాజిక సందేశం ఉన్న  చిత్రంతో  అవార్డ్ లు పొందిన దర్శకుడు రెండో చిత్రం అంటే ...అందరి మాటా ఏమో కానీ కొందరికైనా కొన్ని అంచనాలు ఉంటాయి. అయితే వారి అంచనాలు తలకిందులు చేస్తూ...  కమర్షియల్ టైటిల్, కమర్షియల్ హీరోయిన్ ని పెట్టి టీజర్ వదిలారు. దాంతో  మొదటి సినిమాకు కమర్షియల్ గా వర్కవుట్ అయినట్లు..లేదు..అందుకే ఇలాంటి కాన్సెప్టుతో  సినిమా చేస్తున్నాడనుకుని..చూడాలని చాలా మంది ఫిక్స్ అయ్యారు.

మరీ ముఖ్యంగా బయిట లిప్ టు లిప్ కిస్ ల ట్రెండ్ నడుస్తోంది. ఒక కిస్ కే జనాలు ఎగబడి సినిమాకు వెళ్లిపోతున్నారే..మా సినిమాలో 24 కిస్సులు ఉన్నాయి..మిస్ కావద్దని చెప్పేలా ఉన్న ట్రైలర్స్ తో  బజ్ క్రియేట్ అయ్యింది. అది  ఓపినింగ్స్ కు దారితీసే అంశమే. మరి ఈ ఎలిమెంట్స్ అన్ని సినిమాలో ఉన్నాయా...కేవలం కిస్ లతో సరిపెట్టాడా..కిస్ కు కిస్ కు మధ్య కథ ఏమన్నా పెట్టారా వంటి విషయాలు తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే. 

కథేంటి..

'మిణుగురులు'  వంటి చిల్డ్రన్ ఫిల్మ్స్  తీసే దర్శకుడు  ఆనంద్‌(అరుణ్ అదిత్‌). అయితే అతనికి ఇలాంటి కథలకి కమర్షియల్ గా వర్కవుట్ కావని, డబ్బులు రావని ఫండింగ్ దొరకదు.నిర్మాతలు ముందుకు రారు. అయినా ట్రైల్స్ వేస్తూ ...ఓ కాలేజీలో సినిమాలకు సంభందించిన క్లాస్ చెప్తూంటాడు. ఈ క్రమంలో అక్కడ స్టూడెంట్  శ్రీల‌క్ష్మి(హెబ్బా ప‌టేల్‌)పరిచయం అవుతుంది. సినిమా కోర్స్ చేస్తున్న ఆమె ..ఆనంద్ ప్రతిభకు ముగ్దురాలై (ఈ పదం వాడచ్చా)..ప్రేమలో పడుతుంది. ఈలోగా ఓ రోజు..శ్రీలక్ష్మికు ఎట్రాక్ట్ అయిన ఆనంద్..ఆమె తలపై ముద్దు పెట్టుకుంటాడు. దాంతో ఏ బుగ్గ మీదో వేరొక చోటో ముద్దు పెట్టకుండా ..ఎందుకు..తలపై ముద్దు పెట్టాడని రీసెర్చ్ పోగ్రాం పెట్టుకుంటుంది. ఇంటర్నెట్ ఓపెన్ చేసి గూగుల్ లో సెర్చ్ చేస్తుంది..లైబ్రరికీ పుస్తకాలు చదవుతుంది. అక్కడ ఆమెకు ఓ కొత్త విషయం పరిచయం అవుతుంది. అది 24 ముద్దులు గురించిన ఓ కాన్సెప్టు.

ఎవరైనా జంట 24 ముద్దులు (24 గంటలూ కాదు) పెట్టుకుంటే కనుక..ఆ జంట విడిపోదని తెలుస్తుంది. అక్కడ నుంచి అది నిజమో కాదో చూద్దామనో ..మరెందుకో కానీ ఆమె,అతను ముద్దులు పెట్టుకునే పోగ్రాం పెట్టుకుని విజయవంతంగా 23 ముద్దులు పెట్టుకుంటారు. ఈ లోగా ..ఆమె కు ఓ విషయం అర్దమవుతుంది. అతనికి ముద్దులు మీద ఉన్న ఇంట్రస్టే కానీ..తనతో ప్రేమలో లేడని. అంతేకాదు ప్రేమ,పెళ్లి అంటే ఇష్టం లేదని అర్దం చేసుకుంటుంది. అంతేకాదు..అతనికి మరో ముగ్గురు అమ్మాయిలతో శారీరిక సంభంధం ఉందని తెలుసుకుంటుంది. దాంతో అతన్ని ఎవాయిడ్ చేస్తుంది. 

కానీ ఆమె మనస్సులో ప్రేమ ఎక్కడికి పోదు. అతను మాత్రం...మనం చక్కగా సహజీవనం చేద్దాం..ఎందుకంటే దేశం నిండా ఎటుచూసినా అనాధలే..అందుకే పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టించే కార్యక్రమం వద్దు అంటాడు. ఈ ప్రపోజల్ కు శ్రీలక్ష్మి ఒప్పుకుంటుందా. ఆ 24 ముద్దు ఫినిష్ చేసారా..వారి ప్రేమ కథ చివరకు ఏమైంది వంటి అమూల్యమైన విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

24 kisses movie telugu review

ఎలా ఉందంటే...

'కుమారి 21 ఎఫ్' హెబ్బా పటేల్, 24 కిసెస్ ఈ రెంటి  కాంబినేషన్ ఖచ్చితంగా జనాలని థియోటర్ కు రప్పించేదే. అయితే ఆ వచ్చిన జనాల అంచనాలకు కొంతలో కొంతనా తృప్తి పరిస్తే సినిమా బాగుందనిపిస్తుంది. అయితే దర్శకుడు అయోధ్యకుమార్ అక్కడదాకానే ఆలోచించినట్లున్నారు. తనకు తోచిన సీన్స్ రాసుకుని,షూట్ చేసి ఎడిటర్ ముందేస్తే ...ఆ ముక్కలను కలిపి సినిమాగా వదిలినట్లు అనిపిస్తుంది సినిమా చూస్తూంటే. ఎందుకంటే ఏ సన్నివేశానికి తలా,తోకా ఉండదు. ఏ డైలాగుకు అర్దం పర్ధం ఉండదు. టోటల్ గా సినిమానే ఓ అర్దం కాని అర్దం చేసుకోవటం అనవసరం అనిపించే పదార్దంలా తోస్తుంది. ఇంటర్వెల్ దాకా చూసి అబ్బే..ఇప్పటికి దాకా ఏం జరగలేదు. కేవలం అప్పుడప్పుడూ ముద్దు పెట్టుకోవటం తప్ప ..సర్లే సెకండాఫ్ లో కథ పెట్టుకుని ఉంటాడు అని ఆశపడితే...ఓ చిన్న ప్లాష్ బ్యాక్ పెట్టి శుభం కార్డ్ వేసేస్తాడు. ఇందులో హీరో క్యారక్టర్ చాలా కన్ఫూజన్ గా ఉంటుంది.

దేశంనిండా అనాధ పిల్లలు...మళ్లీ నేను పెళ్లి చేసుకుని మరొకరికి జన్మ ఇవ్వటం ఎందుకు అంటాడు. పుట్టిన పిల్లలను సరిగ్గా చూసుకుంటే వాళ్లు అనాధలు ఎందుకు అవుతారు. అలాగే రేపు పెళ్లయ్యాక ..నా భార్యతో గొడవ పడితే అది చూసిన నా పిల్లలు ఇంట్లోంచి పారిపోతారు..అనాధలు అయ్యిపోతారు అంటాడు. అంత తెలివి ఉన్నవాడు అసలు గొడవలు లేకుండా ఫ్యామిలీని నడపచ్చు కదా అనిపిస్తుంది. అలాగే ఎన్నో నీతులు చెప్పే మన హీరో కుటుంబాన్ని వదిలేసి చిల్డ్రన్ ఫిల్మ్ లు తీస్తూంటాడు. కుటుంబానికి పైసా ఇవ్వడు..ఆదుకోడు. అలా అడుగడుక్కి..చెప్పే  మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన ఉండదు. 

సినిమాలో అసలు సమస్య..

ప్రారంభం నుంచి కథ ఎక్కడికీ కదలదు..ఎక్కడో ప్రీ క్లైమాక్స్ కు వచ్చాక ప్లాష్ బ్యాక్ వచ్చేదాకా హీరో అలా వింతగా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడో అర్దం కాదు. ఆ ప్లాష్ బ్యాక్ అయినా కన్వీసింగ్ గా ఉంటుందా అంటే దర్శకుడు తనకు తగినట్లు కన్వీసింగ్ గా రాసుకున్నారని అర్దమవుతుంది. అలాగే ప్రేమ కథ చెప్తారు అనుకుంటే ..పిల్లలు..దేశంలో పోషకాహార లోపం అనే సబ్జెక్టు ని ఇరికించాలని చూస్తాడు. సరైన మంచినీళ్లు కూడా పిల్లలకు ఈ దేశంలో దొరకటం లేదని ఆవేదన వ్యక్యం చేస్తూంటాడు. అంటే అటు సామాజిక సందేశం అందించి శభాష్ అనిపించుకోవాలి..ఇటు కమర్షియల్ గా ముద్దులు చూపించి డబ్బులు చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది. అంతేకానీ ఈ సందేశం..ఈ లవ్ స్టోరీలో ఇముడుతుందా లేదా..అనేది చూసుకోలేదు. అలాగే లవ్ స్టోరీ లో ఖచ్చితంగా ఉండాల్సిన భావోద్వేగాలు ఏమీ ఈ సినిమాలో కనిపించవు. ఇక సినిమా నేరేషన్ ...అరిగిపోయిన ఆర్ట్ సినిమాలా సహనానికి పరీక్ష పెడుతూ..మెల్లిగా సాగుతూంటుంది. 

24 kisses movie telugu review

టెక్నికల్ గా ..

దర్శకుడుగా  అయోధ్య కుమార్ పూర్తిగా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. క్లారిటీ లేని కథ,కథనం సినిమాని దెబ్బకొట్టింది. సినిమాలో ఏదన్నా హైలెట్ ఉంది ఆంటే అది.  సినిమాటోగ్రఫిని అందించిన ఉదయ్ గుర్రాల పనితనమే. చాలా రిచ్ గా సినిమాను చూపించటంలో సక్సెస్ అయ్యాడు. అడుగడుక్కి వినపించే పాటలు ఓ పెద్ద టార్చర్.నిర్మాణ విలువలు జస్ట్ ఓకే.  

ఎవరు ఎలా చేసారు..

హీరో  అదిత్ .. లుక్ బాగుంది. కానీ క్యారక్టర్ లో జోష్ లేకపోవటంతో డల్ గా ఉండిపోయాడు.  ఇక హెబ్బా ప‌టేల్ పాత్ర ఓ డమ్మి.  ముద్దు సీన్స్‌కు తప్ప మరిదేనికి పనికిరాదన్నట్లుగా డిజైన్ చేసారు.   రావు ర‌మేష్ సైక్రియాటిస్ట్ పాత్ర కామెడీగా అనిపిస్తుంది. అయితే పది నిమిషాల‌కొక‌సారి రావు ర‌మేశ్ పాత్ర తెరపైకి వచ్చి మన చిరాకుని పరాకాష్టకు తీసుకెళ్లటంతో సహాయం చేస్తూంటుంది.   

ఫైనల్ థాట్...

ఇందులో హీరో ..అదే పనిగా ఓ సైక్టాటిస్ట్ దగ్గరకు వెళ్లి తన ప్రేమ గురించి చెప్తూంటాడు. సినిమా పూర్తయ్యాక..ఆ ప్రేరణతో  మనకూ సైక్రాటిస్ట్ దగ్గరకు వెళ్లి ఈ సినిమా చూస్తున్నప్పటి అనుభూతులు చెప్పుకునే అవసరం వస్తుందనిపిస్తుంది.  

రేటింగ్: 1/5 
--
ఎవరెవరు..

నిర్మాణ సంస్థ‌లు: సిల్లీ మాంక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, రెస్పెక్ట్ క్రియేష‌న్స్
న‌టీనటులు: ఆదిత్ అరుణ్, హెబ్బాప‌టేల్, న‌రేష్, రావు ర‌మేష్, అదితి మైఖెల్, శ్రీ‌ని కాపా, మ‌ధు నెక్కంటి త‌దిత‌రులు
సంగీతం: జోయ్ బారువా
ఛాయాగ్ర‌హ‌ణం: ఉద‌య్ గుర్రాల‌
నేప‌థ్య సంగీతం: వివేక్ పిలిప్‌
కూర్పు: ఆల‌యం అనిల్‌
క‌ళ‌: హ‌రి వ‌ర్మ‌
నిర్మాత‌లు: స‌ంజ‌య్ రెడ్డి, అనిల్ ప‌ల్లాల‌, అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి
ద‌ర్శ‌క‌త్వం: అయోధ్య‌కుమార్ కృష్ణం శెట్టి


 

Follow Us:
Download App:
  • android
  • ios