Asianet News TeluguAsianet News Telugu

2024 సంక్రాంతి బరిలో పోటీ పడే హీరోలు వీళ్లే?!

2024 సంక్రాంతికి ఏ సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతాయనే విషయమై టాలీవుడ్ లో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. 

2024 Sankranti going to be biggest clash, movies list
Author
First Published Jan 22, 2023, 7:26 AM IST


మన సౌత్ సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి పండగ ..మనకే సొంతమైన ప్రత్యేకమైన బాక్స్ ఆఫీస్ ఫెస్టివల్ . ఈ పండుగ సీజన్లో సినిమా రిలీజ్ అయ్యి బాగుందని టాక్ తెచ్చుకుంటే చాలు కలెక్షన్స్ కుమ్మేస్తాయి. అందుకే  స్టార్ హీరోల దృష్టి సంక్రాంతిపైనే ఉంటుంది. ప్రతీ  సంక్రాంతికి  సినిమాలు భారీ స్థాయిలో పోటీ పడుతూ ఉంటాయి. అన్ని సినిమాలు పోటాపోటీగా కలెక్షన్స్ అందుకుంటు ఉంటాయి.  ఈసారి తెలుగు తమిళంలో కూడా ఇద్దరు స్టార్ హీరోలు పోటీ పడి గెలిచారు. అంతేకాదు... తెలుగులో  గతంలో ఎప్పుడు లేనివిధంగా ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి రెండు సినిమాలు రావడం విశేషం. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలు ఒకరోజు గ్యాప్ లో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అయ్యాయి.

మరోవైపు తమిళం నుంచి అజిత్ తునివు/తెగింపు సినిమా కూడా తెలుగు తమిళంలో ఏడు రోజుల్లో 149.66 కోట్లకు పైగా గ్రాస్ అందుకుంది. విజయ్ వారిసు సినిమా ఏడు రోజుల్లో తెలుగు తమిళంలో కలిపి 213 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.ఈ రెండు సినిమాల మధ్యలో పోటీ అయితే గట్టిగానే జరిగింది.  సంక్రాంతి పండగ వెళ్లిపోయినా ఇంకా ఈ సినిమాలు భాక్సాఫీస్ ని ఏలుతూనే ఉన్నాయి.  ఈ నేపధ్యంలో వచ్చే సంక్రాంతికు ఇప్పటి నుంచే బెట్టింగ్ లు మొదలయ్యాయి. 2024 సంక్రాంతికి ఏ సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతాయనే విషయమై టాలీవుడ్ లో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. 

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు...2023 సంక్రాంతి...సీనియర్ హీరోల మధ్య క్లాష్ అయితే ...2024 పూర్తిగా యంగ్ హీరోల మధ్యన పోటీగా ఉండనుంది. అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప ది రూల్ సంక్రాంతికే ముస్తాబు కానుంది. అలాగే రామ్ చరణ్, శంకర్ చిత్రం #RC15 సైతం సంక్రాంతికి తెస్తే ఎలా ఉంటుంది..లేదా ఆగస్ట్ కు వస్తే బాగుంటుందా అనే డిస్కషన్ ..దిల్ రాజు క్యాంపస్ లో జరుగుతోంది. మరో ప్రక్క  ప్రభాస్, మారుతి చిత్రాన్ని సంక్రాంతి పోటీకి దింపుతారంటున్నారు.  ఈ లోగా ప్రభాస్ ప్రతిష్టాత్మకమైన చిత్రం #Salaar, ఆదిపురుష్ రిలీజ్ అవుతాయి. ఆ క్రేజ్ సంక్రాంతి సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఏదైమైనా వచ్చే సంక్రాంతికి #AlluArjun, #RamCharan, #Prabhas మధ్య పోటీ ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios