శ్రీయ శరన్ - ఆండ్రూ కోస్చీవ్

15 ఏళ్లుగా సౌత్ ఇండస్ట్రీలో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరోయిన్ శ్రీయ సడన్ గా తన రష్యన్ బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంది. పెద్దగా హడావుడి లేకుండా మార్చ్ 19న ముంబై లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది. 

నవీన్ - భావన

మలయాళం సినీ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న భావన పెళ్లి వేగంగా జరిగిపోయింది. భావన నివాసంలోనే ప్రొడ్యూసర్ నవీన్ ను జనవరి 22న వివాహం చేసుకున్నారు.    

రన్ వీర్ - దీపిక పదుకొనె 

ఇండియన్ టాప్ మోస్ట్ యాక్టర్స్ గా ఉన్న ఈ సెలబ్రేటిస్ వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. నవంబర్ 14, 15 వ తేదీల్లో ఇరు సంప్రదాయాలను గౌరవించి ఇటీలిలో సంప్రదాయబద్ధంగా పెళ్లి బంధంతో మరింత దగ్గరయ్యారు. 

నిక్ జోనస్ - ప్రియాంక చోప్రా

201లోనే వీరి వివాహం చాలా కాస్ట్లీ అని చెప్పాలి. బాలీవుడ్ - హాలీవుడ్ సెలబ్రేటిస్ షాక్ అయ్యేలా ఇద్దరు ఒకటయ్యారు. వీరు కూడా హిందూ మరియు వెస్టర్న్ పద్ధతుల్లో రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు. జోధ్ పుర లో డిసెంబర్ 1న వీరి వివాహం జరిగింది. 

ఆనంద్ అహుజా - సోనమ్ కపూర్

కపూర్ ఫ్యామిలిలో ఈ పెళ్లి ఎంతో సంతోషాన్ని నింపింది. వీరి ప్రేమను ఇరు కుటుంబాల నుంచి మొదట కొంత భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి కూడా చివరికి అందరి సమ్మతంతోనే మే 18న ముంబై లో గ్రాండ్ గా జరిగింది. 

ఆంగాడ్ బేడీ - నేహా ధూపియా

వీరి పెళ్లి జరిగేవరకు కూడా ఎవరికీ తెలియలేదు. కేవలం సన్నిహితుల సమక్షంలోనే ఢిల్లీలో మే 10న సీక్రెట్ గా ఈ సెలబ్రేటిస్ వివాహం జరిగింది. ఇక కొన్ని రోజులకే నేహా ప్రెగ్నెన్సీ న్యూస్ బయటపడటంతో వారి వెడ్డింగ్ పై అనేక రూమర్స్ వచ్చాయి. 

అభినవ్ శుక్లా - రుబీనా డిల్యాక్:

వీరి వివాహం కూడా దాదాపు సిక్రెట్ గానే జరిగిపోయింది. ఎవరికీ తెలియకుండా కుటుంబ సభ్యుల సమక్షంలో జూన్ 21న షిమ్లాలో పెళ్లి చేసుకున్నారు. 

మిలింద్ సోమన్ - అంకిత కొన్వార్

వీరి పెళ్లి ఈ ఇయర్ ఒక సంచలనం అని చెప్పాలి. వయసులో 26 ఏళ్ల వ్యత్యాసం ఉన్న మిలింద్ అంకిత ను వివాహం చేసుకోవడం అప్పట్లో కాంట్రవర్షియల్ గా మారింది.ఏప్రిల్ 22న మహారాష్ట్ర అలిబర్గ్ లో వీరు సీక్రెట్ గా వివాహం చేసుకున్నారు. 

కీత్ సెక్యూరా - రోచెల్లె రావ్:

2017లోనే ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ బ్యూటిఫుల్ కపుల్ మార్చ్ 5న బీచ్ లో వారికి ఇష్టమైన తరహాలో పెళ్లి వేడుకను జరుపుకున్నారు. 

గౌరవ్ చోప్రా - హితిష:

హిందీ టివి సీరియల్ యాక్టర్స్ గా వెలుగొందిన ఈ జంట వివాహం ఫిబ్రవరి 20న జరిగింది. 

హిమేష్ రేషమ్మియా - సోనియా కపూర్: 

ఈ స్టార్ సింగర్ అండ్ సీరియల్ యాక్టర్ ప్రేమ వ్యవహారంపై ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఇక ఫైనల్ గా హిమేష్ మే 12న సోనియాను మనువాడి సొషల్ మీడియాలో అధికారికంగా వివరణ ఇచ్చాడు.    

చిరంజీవి - సార్జా - మేఘన రాజ్:

10 ఏళ్లుగా ఒకరినొకరు అర్ధం చేసుకున్న ఈ కన్నడ యాక్టర్స్ హిందూ సంప్రదాయపద్ధతిలో మే 2న బెంగుళూరులో పెళ్లి చేసుకున్నారు.   

నీరజ్ మాధవ్ - దీప్తి -

ఈ మలయాళీ నటుడు మాధవ్ ఏప్రిల్ 2 న సాధారణ సంప్రదాయ హిందూ ఆచారం ప్రకారం తన దీర్ఘకాల గర్ల్ ఫ్రెండ్ ను వివాహం చేసుకున్నాడు.

షోయబ్ ఇబ్రహీం - దీపిక కాకర్- 

ఈ మినీ స్టార్స్ ప్రేమ ఫిబ్రవరి 22 న భోపాల్ లో పెళ్లి బంధంతో మరింత దగ్గరైంది. 

మహాక్షయ్ చక్రాబోర్టీ - మాదల్సా శర్మ

మిథున్ చక్రవర్తి కుమారుడైన మహాక్షయ్,  చిత్ర నిర్మాత సుభాష్ శర్మ కూతురు మదల్సా  శర్మ వివాహం జులై 10 వ తేదీన జరిగింది. అసలైతే కొన్ని పోలీస్ కేసుల కారణంగా వీరి వివాహం ముందు రద్దయ్యే వరకు వచ్చింది. కానీ ఆ గొడవలు త్వరగానే పరిష్కారం అవ్వడంతో వివాహం చేసుకున్నారు. 

మోహిత్ మార్వా మరియు అంతరా మోటివాలా 

నటుడు మరియు ఫ్యాషన్ స్టైలిస్ట్ అయిన మోహిత్ వివాహం దుబాయ్ లో  ఫిబ్రవరి 22 న గ్రాండ్ గా జరిగినప్పటికీ వేడుకలో భాగంగా హాజరైన శ్రీదేవి అక్కడ మరణించడం పెద్ద చేదు వార్తగా అందరిని కలచివేసింది. 

చైతన్య శర్మ - శ్వేతా త్రిపాఠి - 

నటుడు-రాపర్ చైతన్య  నటి శ్వేత ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఇరుకుటుంబాల సమక్షంలో  జూన్ 29 న గోవాలో అందంగా అందరిని ఆకర్షించే విధంగా వివాహం చేసుకున్నారు.