బాలీవుడ్ లో 'సీరియల్ కిస్సర్' గా పేరు పొందిన నటుడు ఇమ్రాన్ హష్మీ. మల్లికా షెరావత్ నుండి జాక్వలిన్ ఫెర్నాండెజ్ వరకు చాలా మంది హీరోయిన్లతో కలిసి లిప్ లాక్ సీన్లలో నటించాడు. అయితే ఇకపై అలాంటి సన్నివేశాల్లో నటించనని చెబుతున్నాడు ఈ హీరో.

ప్రస్తుతం ఇమ్రాన్ నటించిన 'చీట్ ఇండియా' సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఇమ్రాన్ ఇకపై ముద్దు సీన్లలో నటించనని తేల్చి చెప్పాడు. ''నేను ముద్దులు పెట్టి పెట్టి అలసిపోయాను. నా బాధ ఎవరికీ అర్ధం కాదు. 17ఏళ్లుగా ముద్దులు పెడుతూనే ఉన్నాయి. ఒక్కో సినిమా దాదాపు ఇరవై ముద్దు సీన్లు ఉంటాయి. ఇకపై వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను'' అంటూ వెల్లడించారు.

ఏ నటుడికైనా.. తనకున్న ఇమేజ్ నుండి బయటపడడానికి ఇబ్బంది ఉంటుందని కానీ ప్రయత్నిస్తే అది వర్కవుట్ అవుతుందని అన్నారు. నటుడిగా విభిన్న పాత్రల్లో నటించాలని అనుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

'చీట్ ఇండియా' లాంటి సినిమాలు తనకు సరికొత్త గుర్తింపుని తీసుకోస్తాయని నమ్మకంగా చెబుతున్నారు. సౌమిక్ సేన్  డైరెక్ట్ చేసిన  'చీట్ ఇండియా' జనవరి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.