సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం '2.0'.  గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ...  ఊహించినట్టుగానే బాక్సాఫీస్ దుమ్ము దులిపేస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. అయితే ఈ కలెక్షన్స్  ఇంకా ఎక్కువ అవకాసం ఉన్నా..దాన్ని నిర్మాతలు చేతలారా దెబ్బ కొట్టుకున్నారు అంటున్నారు ట్రేడ్ పండితులు.

రజనీకాంత్, అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం విజువల్ వండర్‌గా తొలిరోజే పేరు తెచ్చుకుంది. దీంతో తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.100 కోట్లు వసూలు చేసింది. ఒక్క హిందీ వర్షనే రూ.63.25 కోట్లు వసూలు చేసినట్టు తరుణ్ ఆదర్శ్ తెలిపారు. అయితే ఈ మ్యాజిక్ అంతా కేవలం 3డిలోనే జరుగుతోంది. 2డి థియోటర్స్ అన్నీ వెలాతెలా పోతున్నాయి. అప్పటికీ తెలుగులో రిలీజ్ చేసిన దిల్ రాజు..తాను 2డిలో కూడా చూసానని, పెద్ద తేడా లేదని మీడియా ముందు చెప్పినా పెద్ద తేడా లేదు.

ఎందుకిలా జరిగింది అంటే...సేమ్ ప్రైస్ కు 2డి, 3డి వెర్షన్స్ లు లభ్యం కావటం. బి,సి సెంటర్లలలో ఎక్కువ 2డి వెర్షన్ ఉన్నా...రేట్లు పెంచి టిక్కెట్లు అమ్మటంతో అదే రేటుకు దగ్గరలో ఉన్న మల్టిఫ్లెక్స్ లోనో మరోచోటో 3డి వెర్షన్ లభ్యమవుతున్నప్పుడు..ఎందుకు 2డికు వెళ్లాలనే ఆలోచనలో జనం అటు వైపు వెళ్తున్నారు. దాంతో 3డి కు హౌస్ ఫుల్స్ ఉన్నా..2డికు బ్యాండ్ పడిపోయింది. 2డి రిలీజ్ చేసిన వాళ్లు గోలెత్తిపోతున్నారు. దానికి తోడు మొదట నుంచి దర్శకుడు శంకర్ కూడా ఈ సినిమాని త్రీడిలో చూస్తేనే మహాద్బుతం అని పబ్లిసిటీ చేసారు. ఇలా 2డి రిలీజ్ చేసిన వాళ్లకు దెబ్బ  కొట్టారు. 

ఇక ఈ సినిమాకు వీకెండ్  బాగా కలిసొచ్చింది. రెండో రోజుతో పోల్చితే మూడో రోజు వసూళ్లు 23.46 శాతం పెరిగినట్టు పేర్కొన్నారు. రజనీకాంత్ మరో రికార్డ్ కూడా సాధించారు.