విపుల్‌ అమృత్‌లాల్ షా నిర్మాణంలో అక్షయ్‌ కుమార్, కత్రినా కైఫ్‌ హీరో హీరోయిన్లుగా అనీస్‌ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌ హిట్ కామెడీ ఎంటర్‌టైనర్‌ `సింగ్ ఈజ్‌ కింగ్‌`. ఈ సినిమా రిలీజ్ అయిన 12 సంవత్సరాలు పూర్తవుతుంది. అయితే ఇప్పటికీ ఈ సినిమా అంతే ఫ్రెష్‌గా అంతే ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందంటున్నారు మూవీ లవర్స్‌.

సినిమా ఘన విజయం సాధించటం మాత్రమే కాదు దర్శకుడి ప్రతిభ, అక్షయ్‌ కుమార్, కత్రినా, సోనూ సూద్‌, ఓంపూరిల నటన, అద్భుతమైన లోకేషన్లు, మ్యూజిక్‌ ఈ సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా అక్షయ్‌ కుమార్‌, విపుల్‌ షా ల కాంబినేషన్‌కు ఈ సినిమాతో ఓ రేంజ్‌ ఇమేజ్‌ దక్కింది. అక్షయ్‌, కత్రినా స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో పాటు ఈ సినిమాలోని టైటిల్‌ ట్రాక్‌ ఇప్పటికీ అభిమానుల గుండెల్లో వినిపిస్తూనే ఉంది.

ఈ సినిమా 12 సంవత్సరాలు పూర్తి చేసుకోవటంపై స్పందించిన హీరో అక్షయ్‌కుమార్‌, నిర్మాత విపుల్‌ షాలు.. `మా బంధం సినిమాలకు అతీతమైనది. ఇప్పటి వరకు మేము 6 సినిమాలు కలిసి పనిచేశాము. మంచి సక్సెస్‌లను చూశాం. వాటిలో సింగ్‌ ఈజ్ కింగ్‌ సినిమా కోసం పనిచేయటం ప్రత్యేకమైన అనుభూతి` అని తెలిపారు. భవిష్యత్తు మరిన్ని సినిమాలు కలిసి పనిచేసేందుకు వీరు ఎదురుచూస్తున్నారు.