102 ఏళ్ళ తండ్రి.. అతనికి ఒక 75 ఏళ్ళ కొడుకు.. అంటే టెక్నికల్ గా ముసలి తండ్రికి ముసలి కొడుకు అనమాట. ఈ థాట్ ఆలోచించడానికి చాలా బాగుంది కదూ. అయితే ఇప్పుడు ఇదే కాన్సెప్టులో తండ్రిగా అమితాబ్ బచ్చన్.. కొడుకుగా రిషి కపూర్ నటిస్తే ఎలా ఉంటుంది? అదిగో ''102 నాటౌట్'' సినిమా టీజర్ తరహాలో ఉంటుంది. బాలీవుడ్ ను షేక్ చేస్తున్న ఈ సినిమా కథాకమామిషూ ఏంటో చూద్దాం పదండి. 

దాదాపు 27 ఏళ్ళ తరువాత అమితాబ్ అండ్ రిషి కపూర్ కలసి నటిస్తున్న సినిమా ఇది. ఇప్పుడు ఈ కాంబినేషన్లో 'ఓ మై గాడ్' సినిమాను తీసిన ఉమేష్ శుక్లా ఒక గుజరాతీ నాటకం ఆధారంగా ఈ ''102 నాట్ ఔట్'' సినిమాను తీస్తున్నారు. ఈ సినిమా కథ చాలా సింపుల్. చాలా ముసలాడైన తండ్రి ఎంతో ఎనర్జటిక్ గా ఉంటూ తన ముసలి కొడుకును ఆటపట్టిస్తుంటాడు. అయితే ఆ కొడుకుకు కొన్ని ఇబ్బందులు రావడంతో.. మామూలుగా చరిత్రలో పిల్లలు తమ తల్లిదండ్రులను ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో పెడతారు కాని.. ఇక్కడ మాత్రం తన తండ్రే కొడుకును వృద్దాశ్రమానికి పంపేయాలని అనుకుంటాడు. అప్పుడు ఏం జరుగుతుంది అనేదే సినిమా. 102 ఏళ్ళ కురు వృద్దుడిగా అమితాబ్ గెడ్డంతో ఇరగదీస్తే.. రిషి కపూర్ కూడా అదరగొట్టేశాడు. 

మే 4న రిలీజ్ అవుతున్న ఈ సినిమా టీజర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. ఎందుకంటే ఇద్దరు ఉద్దండులైన నటులు తమ సత్తాను చాటేస్తుంటే సిల్వర్ స్ర్కీన్ సైతం ఉలిక్కిపడుతోంది. చూద్దాం సినిమా ఎలా ఉండబోతుందో!!