బాలీవుడ్ బ్యూటీ సిన్హా తనను చేశారంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అస్లీసోనాఅరెస్టెడ్‌ అనే హ్యాష్ ట్యాగ్ తో నిన్నటి నుండి ఇంటర్నెట్ లో ఓ వీడియో ట్రెండ్ అవుతోంది. 'మీరు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు..? నేనేం తప్పు చేశాను..?' అంటూ సోనాక్షి నిలదీస్తున్నట్లుగా ఆ వీడియో ఉంది.

ఆ తరువాత 'ఇంత అందంగా ఉంటే అరెస్ట్ చేసేస్తారా..?' అంటూ చెప్పడంతో పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తుందని అభిమానులు కూల్ అయ్యారు. అసలు విషయంలోకి వస్తే.. మైగ్లామ్ అనే మేకప్ కలెక్షన్ బ్రాండ్ తరఫున సోనాక్షి ప్రచారం చేస్తున్నారు.

దీనికి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా ఆమె అరెస్ట్ అయినట్లుగా ఉన్న వీడియోను రూపొందించారు. ఈ వీడియోను తన అభిమానులతో పంచుకొని బ్రాండ్ ని ప్రమోట్ చేసింది.

''అవును నన్ను అరెస్ట్ చేశారు..? ఎందుకో అడగండి.. ఎందుకుంటే ఇంత అందంగా కనిపించడం నేరం కాబట్టి.. మైగ్లామ్ తరఫున ప్రచారం చేస్తున్నానని చెబుతున్నందుకు ఉద్వేగానికి లోనవుతున్నా.. దీని ప్రొడక్ట్స్ తో మీరు ఎంతో అందంగా కనిపిస్తారు'' అంటూ రాసుకొచ్చింది. సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'మిషన్ మంగళ్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అలానే 'దబాంగ్ 3'సినిమాలో నటిస్తోంది.