Asianet News TeluguAsianet News Telugu

#SitaRamam:రేపే ‘సీతారామం’రిలీజ్ ఫిక్స్...భారీ ఓపినింగ్స్?

మళయాళ సూపర్  స్టార్ హీరో దుల్ఖర్ సల్మాన్ (Dulquer Salman) హీరోగా నటించిన రెండో స్ట్రైట్ తెలుగు సినిమా ‘సీతారామం’ (Sitaramam). మృణాళ్ ఠాకూర్ (Mrinal Thakur) హీరోయిన్ గా నటించింది. యుద్ధంతో రాసిన ప్రేమకథ దీనికి ట్యాగ్ లైన్. స్వప్న సినిమాస్ (Swapna Cinemas) బ్యానర్ పై, వైజయంతి మూవీస్ సమర్పణలో, హనురాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆగస్ట్ 5న ఈ సినిమా థియేటర్స్ విడుదల అయ్యి...మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే ఇప్పుడు మళ్లీ ఆగస్ట్ 11 రిలీజ్ ఏమిటీ అంటారా...అందుకు రీజన్  ఉంది..

 #Sitaramam releasing in UAE from 11th August
Author
Hyderabad, First Published Aug 10, 2022, 7:32 AM IST

‘సీతారామం’  సినిమాకు లాస్ట్ మినిట్ లో ఈ సినిమా దుబాయి రిలీజ్ కు సమస్యలు వచ్చాయి.  ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ కాగా, గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా రిలీజ్‌కు సెన్సార్ నో చెప్పింది. ఈ సినిమాలో మతపరమైన కొన్ని సీన్స్ ఉన్నాయని, అందువల్లే ఈ సినిమాను గల్ఫ్‌లో రిలీజ్ చేయొద్దంటూ సెన్సార్ తెలిపింది. ఈ క్రమంలో తమ సినిమాను గల్ఫ్ దేశాల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రీసెన్సార్ చేయించింది టీమ్. ఇప్పుడు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి అయ్యి ఆగస్ట్ 11 న  UAE లో భారీ గా రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ హిట్ టాక్ ఉంది కాబట్టి ఓపినింగ్స్ ఓ రేంజిలో ఉంటాయని భావిస్తున్నారు.

 దుల్కర్ కు గల్ఫ్ దేశాల్లో మంచి మార్కెట్ ఉంది. సినిమా హిట్టైతే దాదాపు 25 కోట్లు వరకూ వసూలు చేస్తుంది. కురూప్ కు అక్కడ మంచి ఓపినింగ్స్, కలెక్షన్స్ వచ్చాయి.   ఇప్పటికే ఈ చిత్రం తెలుగు తో పాటు తమిళ, మలయాళ వెర్షన్స్ లోనూ చిత్రం విడుదల అయ్యింది.  

ఇక  20 ఏళ్ళ క్రితం లెఫ్టినెంట్ రామ్ నాకో బాధ్యత అప్పగించారు. ఈ ఉత్తరాన్ని సీతామహాలక్ష్మికి నువ్వే చేర్చాలి’ అనే పాయింట్ చుట్టూనే సినిమా కథ నడుస్తుంది. ఆ ఉత్తరం పట్టుకొని జర్నలిస్ట్ ఆఫ్రిన్ (రష్మికా) ప్రయాణం మొదలు పెడుతుంది. పదిరోజుల్లో ఆ ఉత్తరం సీతకు అప్పగించడమే తన లక్ష్యం. అయితే ఆ పేరుతో ఎవరూ లేరని తెలుస్తుంది. అయినా సరే సీతకోసం అన్వేషణ మొదలవుతుంది. 1965 నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ ఎంతో హృద్యంగా ఉంది. 
 
ప్రకాష్ రాజ్, తరుణ్ భాస్కర్, మురళీ శర్మ, సుమంత్ , భూమిక ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాలోని చాలా భాగం కశ్మీర్ లో చిత్రీకరించారు. అలాగే.. కశ్మీర్ లోయలోని ప్రపంచంలోనే ఎత్తైన పోస్టాఫీస్ లో దుల్ఖర్ సల్మాన్ లెటర్స్ పోస్ట్ చేసే సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఆ క్రమంలో చిత్ర యూనిట్ చాలా కష్టాలు పడిందని దర్శకుడు హను చెప్పాడు. యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఒక యువకుడు ఒక అందమైన అమ్మాయి ప్రేమలో పడితే జరిగే పరిణామాల్ని.. ఈ సినిమాలో ఎంతో అందంగా చూపించారు. విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandrasekhar) సంగీతం అందించిన ఈ పిరియాడికల్ లవ్ స్టోరీ  కి ప్రేక్షకాదరణ బాగుంది.

Follow Us:
Download App:
  • android
  • ios