బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై మరో వివాదం చెలరేగింది. ప్రస్తుతం ఆయన 'దబాంగ్ 3' సినిమాలో నటిస్తున్నారు. సినిమా షూటింగ్ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరుగుతోంది. సల్మాన్ బర్త్ ప్లేస్ కూడా ఇదే.

దీంతో సినిమా చిత్రీకరణలో మొదటి సన్నివేశాన్ని ఇండోర్ నుండే షూట్ చేయాలని సినిమా యూనిట్ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మహేశ్వర్ ప్రాంతంలో నర్మదా నది తీరాన చిత్రబృందం ఓ సెట్ ను నిర్మించింది. ఆ సెట్ లో చెక్కల కింద శివలింగం ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి చూసిన కొందరు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా కూడా ఈ సంఘటన దుమారం రేపడంతో సల్మాన్ ఖాన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

శివలింగంపైన చెక్కలు పెట్టలేదని, షూటింగ్ పూర్తయ్యే వరకు అది పాడవకుండా తామే అలా దాచామని తెలిపారు. షూటింగ్ పూర్తయిన తరువాత వెంటనే తీసేస్తామని అన్నారు. ప్రభుదేవా డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తోంది.