ప్రభాస్ హీరోగా దర్శకుడు సుజీత్ రూపొందిస్తోన్న హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా 'సాహో'. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, మేకింగ్ వీడియోలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు.

ఎప్పటినుండో టీజర్ కోసం ఎదురుచూస్తోన్న అభిమానులను తాజాగా విడుదలైన టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. 'బాధైనా హ్యాపీనెస్ అయినా నాతో షేర్ చేసుకోవడానికి ఎవరూ లేరు..' అని శ్రద్ధా చెప్పేడైలాగ్ తో టీజర్ మొదలైంది. టీజర్ చివరలో.. ప్రభాస్ 'ఫ్యాన్స్.. డైహార్డ్ ఫ్యాన్స్' అంటూ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది.

నిమిషం 38 సెకన్లు ఉన్న టీజర్ మొత్తాన్ని యాక్షన్ సీన్లతో నింపేశారు. కథ, హీరో క్యారెక్టరైజేషన్ ని పక్కన పెట్టి.. పూర్తిగా ప్రొడక్షన్ వాల్యూస్, భారీతనం, స్టన్నింగ్ విజువల్స్ పై దృష్టి పెడుతూ టీజర్ కట్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది.

హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్, ఇంటర్నేషనల్ ఎక్విప్ మెంట్ తో రూపొందించిన ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు.