ఈ మధ్యకాలంలో మన హీరోలు తమ సినిమాలను సోలోగా రిలీజ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. పోటీగా సినిమాను రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్ మీద ఎఫెక్ట్ పడుతోందని సోలో రిలీజ్ కి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఓ డేట్ కోసం ఇద్దరు హీరోలు ఫైట్ చేసుకోవడానికి హాట్ టాపిక్ గా మారింది.

శర్వానంద్, సుధీర్ వర్మ కాంబినేషన్ లో వస్తోన్న 'రణరంగం' సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఓ స్పష్టతకు రాలేకపోతుంది. ఇప్పటికే మూడు డేట్ లు మారిన ఈ సినిమా ఆగస్ట్ 2న విడుదల చేయడానికి భావిస్తున్నారు. అదే సమయానికి బెల్లంకొండ శ్రీనివాస్ 'రాక్షసుడు' సినిమా కూడా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. 

ఇప్పటికే సోలో డేట్ కోసం ఈ సినిమాను చాలా వెనక్కి జరిపారు. ఆఖరికి తమ డేట్ మీద 'ఇస్మార్ట్ శంకర్' సినిమా వస్తే.. అప్పుడు కూడా వెనక్కి వెళ్లారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఆగస్ట్ 2న ఫిక్స్ అయ్యారు. అయితే అక్కడ శర్వానంద్ సినిమా వచ్చి చేరింది. దీంతో ఈ రెండు సినిమాల డిస్ట్రిబ్యూటర్ లు నిర్మాత దిల్ రాజు దగ్గర పంచాయితీ జరుపుతున్నారు. 

ఈ రెండు సినిమాల్లో ఒకటి సెప్టెంబర్ 13కి జరపాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ శర్వాకి వెనక్కి వెళ్లడం ఇష్టం లేదు. ఆగస్ట్ 2న రావాలని ఫిక్స్ అయ్యాడట. ఆగస్ట్ నెలలో మన్మథుడు 2, సాహో సినిమాలు ఉండడంతో కచ్చితంగా సెప్టెంబర్ వరకు ఎదురుచూడాల్సిన పరిస్థితి. మరి శర్వా, బెల్లంకొండలలో ఎవరు తగ్గుతారో చూడాలి!