Asianet News TeluguAsianet News Telugu

'ఎన్టీఆర్ మహానాయకుడు' క్లైమాక్స్ ఇదే ?

ఈ శుక్రవారమే ధియోటర్స్ లోకి దిగబోతున్న మహానాయకుడు సినిమాపై రోజుకో వార్త, ఇప్పుడేమో గంటకో వార్త   ప్రచారంలోకి వస్తోంది. కథానాయకుడు డిజాస్టర్ ప్రభావం తో మహానాయకుడు విషయంలో బాలకృష్ణ, క్రిష్ లు  ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. 

'NTR Mahanayakudu' will portray incidents till Basavatarakam's death
Author
Hyderabad, First Published Feb 21, 2019, 3:58 PM IST

ఈ శుక్రవారమే ధియోటర్స్ లోకి దిగబోతున్న మహానాయకుడు సినిమాపై రోజుకో వార్త, ఇప్పుడేమో గంటకో వార్త   ప్రచారంలోకి వస్తోంది. కథానాయకుడు డిజాస్టర్ ప్రభావం తో మహానాయకుడు విషయంలో బాలకృష్ణ, క్రిష్ లు  ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. 

తొలి చిత్రం కథానాయకుడు లోపాలు రిపీట్ కాకుండా మహానాయకుడికి రీ షూట్స్ చేసి మరీ… సినిమాని ప్రేక్షకులు మెప్పించేలా తీర్చిదిద్దారని టాక్. అయితే ట్విస్ట్ ఏమిటటంటే.. కథానాయకుడు మీదున్న ఇంట్రెస్ట్ లో పావు వంతు కూడా మహానాయకుడు మీద కలగడం లేదు. అలాగే బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ కూడా మహానాయకుడు మీద వ్యూహాత్మక మౌనం వహిస్తున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే..తాజాగా మహానాయకుడు క్లైమాక్స్ మీద  ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కథనాయకుడు చిత్రం ఎక్కడైతే ప్రారంభమైందో ...మహానాయకుడు చిత్రం అక్కడే ముగుస్తుందంటున్నారు.  కథానాయకుడు సినిమా ఓపెనింగ్ షాట్.. బసవతారకం క్యాన్సర్ తో బాధపడుతూ… తన పెళ్లి ఆల్బమ్స్ చూస్తూ ఎన్టీఆర్ జీవితాన్ని తన కొడుకు హరికృష్ణకి చెప్పడంతో మొదలు పెట్టడం గుర్తుండే ఉండి ఉంటుంది. ఇప్పుడు మహానాయకుడు సినిమా క్లైమాక్స్ లో బసవతారకం ని క్యాన్సర్ మహమ్మారి కబళించడంతో.. మరణించటం చూపిస్తారు.. అదే మహానాయకుడు క్లైమాక్స్. 

అదే సమయంలో ఎన్టీఆర్ రాజకీయాలతో సతమవుతూ.. భార్య ఆరోగ్యంపై కూడా ఆందోళలనతో ఉన్నప్పుడు.. నాదెండ్ల భాస్కర్ రావు…. భార్య ఆరోగ్యం సంగతి చూసుకొని.. నిశ్చింతగా వెళ్ళిరండి.. ఇక్కడ రాజకీయాలను నేను చూసుకుంటా అని చెప్పడం ఆ తర్వాత  ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడవడం  జరుగుతుంది.

మహానాయకుడు సినిమాలో ఈ  నాదెండ్ల ఎపిసోడ్  ఉంటుంది.. ఎన్టీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అవడం వరకే సినిమా ఉంటుందని వినికిడి.  ఇక బాలకృష్ణ ఎన్టీఆర్ గా, విద్య బాలన్ బసవతారకంగా నటిస్తున్న ఈ సినిమా రేపు శుక్రవారం విడుదలై ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి. అసలే ప్రమోషన్స్ వీక్ గా ఉన్న ఈసినిమాకి… పాజిటివ్ టాక్ పడితే.. చాలన్నట్లు టీమ్ ఎదురుచూస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios