Asianet News Telugu

రుచిలేదోయి ('మిఠాయి' రివ్యూ)

ప్రోమోలు ఇంట్రస్టింగ్ గానే ఉన్నాయి...ఈ జనరేషన్ కు సంభందించిన ఇద్దరు కమిడియన్స్ హీరోలుగా చేస్తున్నారు. టైటిల్ కూడా సమ్ థింగ్ డిఫరెంట్ గానే ఉంది...డైరక్టర్ ఏదో డార్క్ కామెడీ అంటూ కొత్త పదం వాడాడు...ఓ లుక్కేద్దాం అనుకునే వాతావరణం అయితే క్రియేట్ చేసింది మిఠాయి. దాంతో  ఉత్సాహపడి ధియోటర్ లోకి వెళ్ళినవాళ్లు మిఠాయిని ఫుల్ గా ఎంజాయ్ చేసారా...అంచనాలకు తగినట్లుగా డైరక్టర్ సినిమాను  తెరకెక్కించాడా...అసలేం జరిగిందో ..సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

'Mithai' telugu movie Review
Author
Hyderabad, First Published Feb 23, 2019, 3:45 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఇదండీ కథ..

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌  సాయి (రాహుల్ రామ‌కృష్ణ‌) కు పెళ్లి సెట్ అవుతుంది. ఇంకో రెండు రోజుల్లో పెళ్లి అనగా..బాస్ టార్చర్ తట్టుకోలేక జాబ్ వదిలేస్తాడు. అంతేకాదు ఆ ప్రస్టేషన్ లో తాగి ఇంటికి వచ్చిన సాయికి..తన ఫియాన్సీ కోసం చేయించిన నెక్లెస్ దొంగతనానికి గురైందని తెలుసుకుంటాడు. అప్పుడు ఓ ఛాలెంజ్ ఎదురు అవుతుంది. ఆ నెక్లెస్ దొంగిలించిన వాడిని పట్టుకున్నాకే పెళ్లి చేసుకుంటానని శపధం చేస్తాడు. తన శపధం నెరవేరేందుకు గానూ తన స్నేహితుడు జానీ (ప్రియదర్శి) సాయం అడుగుతాడు. అక్కడ నుంచి ఇద్దరూ కలిసి ఆ దొంగను పట్టుకునేందుకు బయిలుదేరతాడు. ఆ క్రమంలో ఏం జరిగింది. ఆ దొంగ ఎవరో తెలిసిందా...సాయి పెళ్లైందా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  

ఇదేమి డార్క్ కామెడీ

సినిమా ఎలా ఉంది అంటే పరమ నాశిరకంగా ఉందనే చెప్పాలి. ఎక్కడా ఇంట్రస్ట్ అనేది లేకుండా అలా సాగిపోతుంది. సినిమా ప్రారంభమైన కొద్ది సేపటికే ట్రాక్ తప్పేస్తుంది. ఎప్పటికైనా ఈ ఇద్దరు కమిడియన్స్ కామెడీ చెయ్యకపోతారా అని ఎెదురుచూస్తూ క్లైమాక్స్ కు వచ్చేస్తాం. ఫస్టాఫ్ లో ఏం జరిగిందో..సెకండాఫ్ లోనూ అవే సంఘటనలు జరుగుతూంటాయి. చాలా క్యారక్టర్స్ వస్తూంటాయి..పోతూంటాయి. వాటికి మనకు కానీ, కథకు కానీ కొంచెం కూడా సంభంధం ఉండదు. అదే డార్క్ కామెడీ ..కొత్త తరహా స్క్రీన్ ప్లే అంటే మనం చేసేదేమీ ఉండదు. కేవలం హీరోలిద్దరు పాత్రలు రాసుకోవటం వరకే దర్శకుడు చేసాడని, స్క్రిప్టు ని డవలప్ చేయకుండా తెరకెక్కించాడని అర్దమై మనం నిట్టూర్చటం తప్ప చేసేదేమీ ఉండదు. 

ఎవరెలా చేసారంటే...

రాహుల్.. ప్రియదర్శి తమ శక్తి మేరకు కామెడీ చేద్దామని ప్రయత్నించారు. అలాగే డైలాగులు సైతం వాళ్లు అప్పటికప్పుడు సెట్ లో చెప్పినవే అనిపిస్తాయి. మిగతా పాత్రలకు క్లారిటీ లేదు. ఆ పాత్రల్లో నటించిన వాళ్లకు అంతకన్నా క్లారిటీ లేదు. కాబట్టి కంగాళిగా , గందరగోళంగా అనిపిస్తుంది.

మందుబాటిల్

ఈ సినిమా స్పెషాలిటీ ఏమిటంటే..ప్రతీ క్యారక్టర్ ఏదో ఒక సమయంలో ఓ మందు బాటిల్ పట్టుకుని కనపడటమే. అదే డైరక్టర్ ఈ సినిమాలో ఫెరఫెక్ట్ గా మెయింటైన్ చేసిన విషయం. 

టెక్నికల్ గా 

వివేక్ సాగర్ పాటలు జస్ట్ ఓకే అన్నట్లున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది.  రవివర్మన్ ఛాయాగ్రహణం సినిమా కు తగినట్లే యావరేజ్ గా ఉంది. రిజల్ట్ ముందే ఊహించినట్లుగా పెద్దగా ఖర్చు పెట్టలేదని అనిపిస్తుంది. దర్శకుడు ప్రశాంత్ కుమార్.. తానేదో కొత్త తరహా నేరేషన్ ట్రై చేస్తున్నానని అనుకుని ఇలాంటి కథ,కథనాలు రాసుకుని ఓ బ్యాడ్ ఫిల్మ్ ని తీసాడు.  ఎడిటింగ్ బాగుంది గాని, సెకండాఫ్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. 

ఫైనల్ థాట్

కొత్తగా ట్రై చేస్తున్నాం అన్నారంటే ఫ్లాఫ్ సినిమా తీస్తున్నారు అని అర్దం చేసుకోవాల్సిన పరిస్దితి ఇలాంటి సినిమాలు వల్లే ఏర్పడుతోంది

Rating: 1/5

ఎవరెవరు

న‌టీన‌టులు: ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌, కమల్ కామరాజు, భూషణ్ కల్యాణ్, రవి వర్మ, అజయ్ ఘోష్, అర్ష, శ్వేత వర్మ, అదితి మ్యాకల్, విజయ్ మరార్, గాయత్రి గుప్తా త‌దిత‌రులు

ఛాయాగ్రహణం: రవివర్మన్ నీలమేఘం 

సంగీతం: వివేక్ సాగర్ 

కూర్పు: గ్యారీ బి.హెచ్ 

సాహిత్యం: కిట్టు విస్సా ప్రగడ 

మాటలు: ప్రశాంత్ కుమార్, బి. నరేష్ 

నిర్మాత: డాక్టర్ ప్రభాత్ కుమార్ 

దర్శకత్వం: ప్రశాంత్ కుమార్ 

సంస్థ‌: రెడ్ యాంట్ ఫిల్మ్ ప్రొడ‌క్ష‌న్స్‌

విడుద‌ల తేదీ‌: 22 ఫిబ్ర‌వ‌రి 2019

Follow Us:
Download App:
  • android
  • ios