సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. అయితే ఏపీలో ఈ సినిమా రిలీజ్ కాకుండా చేస్తారని, టీడీపీ పార్టీ ఈ సినిమాను అడ్డుకోవడం ఖాయమనే మాటలు ఓ రేంజ్ లో వినిపిస్తున్నాయి.

తన సినిమాను ఎవరైనా అడ్డుకుంటే యూట్యూబ్ లో రిలీజ్ చేస్తానని వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో వర్మ తన ప్రమోషన్స్ మరింత ముమ్మరం చేశాడు.

తాజా ఆయన సోషల్ మీడియాలో ఓ పోల్ నిర్వహించాడు. రాబోయే ఎన్నికల ఫలితాలపై 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ప్రభావం ఉంటుందా..? లేదా..? అనేది పోల్ సారంశం. అయితే పోల్ నిర్వహించిన గంటన్నరలోనే పదివేలకు పైగా నెటిజన్లు ప్రభావం ఉంటుందని ఓటేశారు.

దీన్ని బట్టి సినిమాపై జనాల్లో ఎంత క్రేజ్ ఉందో తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించి పలు సందర్భాల్లో వర్మ విడుదల చేసిన పాటలు, ట్రైలర్లు అన్నింటికీ కలిపి డిజిటల్ మీడియాలో ఇప్పటివరకు మూడు కోట్ల వ్యూస్ వ్యూస్ వచ్చినట్లుగా ఎంతో గర్వంగా ట్వీట్ పెట్టాడు.