సోషల్ మీడియా హవా పెరిగిపోవడంతో నెటిజన్లు నేరుగా సెలబ్రిటీలతో మాట్లాడడం మొదలుపెట్టారు. వందల కొద్దీ మెసేజ్ లు పెడితే ఒక్కదానికైనా రిప్లై ఇవ్వకపోతారా అని అభిమానులు మెసేజ్ లు చేస్తూనే ఉంటారు. 

కొందరు అభిమానంతో ఇలా సెలబ్రిటీలకు మెసేజ్ లు చేస్తుంటే మరికొందరు మాత్రం వారితో తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుగా వ్యవహరిస్తుంటారు. అలాంటి ఓ నెటిజన్ కి తాప్సీ తన సమాధానంతో బుద్ధి చెప్పింది. అకు పాండే అనే ఓ నెటిజన్ తాప్సీని ట్యాగ్ చేసి 'ఐ లవ్ యువర్ బాడీ పార్ట్స్' అని మెసేజ్ చేశాడు.

ఇది చూసిన తాప్సీ 'వావ్.. నాకు కూడా అవంటే చాలా ఇష్టం. ఇంతకీ నీ ఫేవరేట్ ఏంటి..? నాకైతే సెరిబ్రం(మస్తిష్కం)' అని సమాధానమిచ్చింది. ఈ సమాధానంతో సదరు నెటిజన్ సైలెంట్ అయిపోయాడు.

తాప్సీ అభిమానులు ఆమె తీరుని పొగుడుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగులో పలు సినిమాల్లో నటించిన తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్ లో సెటిల్ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆమె వరుస విజయాలు అందుకుంటోంది. మంచి కథలు దొరికితే తెలుగులో కూడా నటించాలని భావిస్తోంది ఈ బ్యూటీ.