Asianet News TeluguAsianet News Telugu

Geeta Arts :'డిజాస్టర్ డైరక్టర్ తో 'గీతా ఆర్ట్స్2' కొత్త సినిమా..!

GA2 పిక్చర్స్ లో ప్రస్తుతం పలు ఇంట్రస్టింగ్ చిత్రాలు రూపుదిద్దుకుంటుండగా.. తాజాగా ఈ బ్యానర్ లో మరో కొత్త ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు. 'జోహార్' 'అర్జున ఫాల్గుణ' చిత్రాల దర్శకుడు  తేజ మర్ని డైరక్షన్ లో  బన్నీ వాస్ - విద్య మాధురి నిర్మాణంలో ఓ సినిమా ప్రారంభించారు.

'Geeta Arts 2' new movie with 'Johar' director !
Author
Hyderabad, First Published Jun 30, 2022, 12:19 PM IST

 
తెలుగు లో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో 'గీతా ఆర్ట్స్' ఒకటి. ఈ బ్యానర్ నుంచి సినిమా వస్తోందంటే ఖచ్చితంగా సూపర్ హిట్ అనే పేరు ఉంది.  మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ జడ్జిమెంట్ మీద నమ్మకం అది. ఆయన  సారథ్యంలో నడిచే ఈ సంస్థ నుంచి గత కొన్నేళ్లుగా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు - సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అయితే గత కొంతకాలం గా ఆ పేరు కూడా మెల్లిగా మాయమవుతోంది. గీతా ఆర్ట్స్ కు అనుబంధ సంస్థగా 'గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్' బ్యానర్ పై ఆయన సినిమాలు తీస్తున్నారు.   బన్నీ వాసు ఆధ్వర్యంలో నడిచే జీఏ2 బ్యానర్ లో హై బడ్జెట్ సినిమాలతో పాటుగా చిన్న మీడియం రేంజ్ చిత్రాలను నిర్మిస్తున్నారు.  

డిస్ట్రిబ్యూటర్‌గా కెరియర్ మొదలుపెట్టి ‘100 పర్సంట్ లవ్’ సినిమాతో నిర్మాతగా మారి ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించిన నిర్మాత బన్నీ వాస్ (Bunny Vas).GA2 పిక్చర్స్ లో ప్రస్తుతం పలు ఇంట్రస్టింగ్ చిత్రాలు రూపుదిద్దుకుంటుండగా.. తాజాగా ఈ బ్యానర్ లో మరో కొత్త ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు. 'జోహార్' 'అర్జున ఫాల్గుణ' చిత్రాల దర్శకుడు  తేజ మర్ని డైరక్షన్ లో  బన్నీ వాస్ - విద్య మాధురి నిర్మాణంలో ఓ సినిమా ప్రారంభించారు. ఓటిటిలో రిలీజైన జోహార్ చిత్రానికి క్రిటికల్ ఎక్లైమ్ లభించగా...శ్రీ విష్ణు తో చేసిన 'అర్జున ఫాల్గుణ'  డిజాస్టర్ అయ్యింది. 

ఈరోజు గురువారం గీతా ఆర్ట్స్2 లో 'ప్రొడక్షన్ నెంబర్ 8' చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ - వరలక్ష్మి శరత్ కుమార్ - రాహుల్ విజయ్ - శివాని రాజశేఖర్ కీలక పాత్రల్లో నటించనున్నారు. మురళీ శర్మ - బెనర్జీ - పవన్ తేజ్ కొణిదెల ఇతర పాత్రలు పోషించనున్నారు. ఇది పూర్తిగా కంటెంట్ ప్రధానంగా సాగే సినిమా అని చెప్తున్నారు. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి శక్తికాంత్ కార్తీక్ సంగీతం సమకూరుస్తున్నారు. గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. భాను ప్రతాప కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.
 
ఇక ఇదే బ్యానర్ నుంచి  జూలై 1న ‘పక్కా కమర్షియల్’ సినిమా వస్తుంది.   సెప్టెంబర్ 10న నిఖిల్ హీరోగా తెరకెక్కించిన ‘18 పేజెస్’ చిత్రాన్ని విడుదల చేస్తాము. దసరా సీజన్‌లో సెప్టెంబర్ 30న కిరణ్ అబ్బవరంతో చేస్తున్న ‘వినరో భాగ్యము విష్ణు కథ’ విడుదల చేస్తున్నారు. అలాగే ఆగస్ట్‌లో అల్లు శిరీష్ హీరోగా చేస్తున్న సినిమా విడుదల ఉంటుంది. కంటిన్యూగా ఈ మూడు నాలుగు నెలలు గీతా ఆర్ట్స్ 2 నుంచి సినిమాలు వస్తూనే ఉంటాయి.

Follow Us:
Download App:
  • android
  • ios