జమ్ము కశ్మీర్ విభజనను నటుడు కమలహాసన్ తీవ్రంగా వ్యతిరేకించారు. జ‌మ్మూక‌శ్మీర్‌లో ప్ర‌త్యేక హోదా క‌ల్పించే ఆర్టిక‌ల్ 370 ర‌ద్దుతో పాటు ఆ రాష్ట్రాన్ని రెండుగా విభ‌జిస్తూ కేంద్ర స‌ర్కార్ తీసుకున్న నిర్ణ‌యాన్నిఆయన తప్పుబడుతున్నారు. పార్ల‌మెంట్‌లో ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరు ప్ర‌జాస్వామ్యంపై దాడి చేసిన‌ట్లుగా ఉంద‌న్నారు.

ప్ర‌భుత్వం నిర్ణ‌యం ఆక్షేప‌ణీయంగా ఉంద‌ని, అది నిరంకుశ చ‌ర్య అని అన్నారు. ఆర్టిక‌ల్ 370, 35ఏల‌కు ఓ ప్ర‌త్యేక‌త ఉన్న‌ద‌ని, కానీ మార్పులు చేయాల‌నుకుంటే, ముందుగా చ‌ర్చ‌ల ద్వారా ఆ ప్ర‌క్రియ చేప‌ట్టాల‌న్నారు.

ప్రతిపక్షాల వారి కనీస అభిప్రాయాలను తెలుసుకోకుండా పార్లమెంట్‌లో నిరంకుశగా వ్యవహరించారని అన్నారు. కనీసం బిల్లుపై చర్చించే సమయం కూడా ఇవ్వలేదని మండిపడ్డాడు. ముఖ్యంగా కేంద్రం వ్వవహరించిన తీరును తప్పు బట్టిన ఆయన ప్రజాస్వామ్యం తిరిగమనదిశగా పయనిస్తుందని పేర్కోన్నారు.

కమల్ హాసన్ తో పాటు చాలా మంది రాజకీయనాయకులు ఈ చర్యను తప్పుగా పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు పలు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.కాంగ్రెస్‌తో పాటు డీఎంకే, పీడీపీ ఇతర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈనేపథ్యంలోనే ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.