బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియా మొత్తం బాలీవుడ్ హీరోలని తలదన్నే స్టార్ గా మారిపోయాడు. టాలీవుడ్ లో ఇండియా మొత్తం మార్కెట్ ఉన్న ఏకైక హీరో ప్రభాస్. ప్రభాస్ చివరగా సాహో చిత్రంలో నటించాడు. ఆ మూవీ ఫ్యాన్స్ కు నిరాశనే మిగిల్చింది. 

ఇదిలా ఉండగా ప్రభాస్ ప్రస్తుతం జాన్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. పూజ హెగ్డే, ప్రభాస్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకుడు. ఇటీవలే ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు బర్త్ డే సెలెబ్రేషన్ జరిగాయి. ఈ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో ప్రభాస్ కూడా పాల్గొన్నాడు. 

ఇదిలా ఉండగా తన బర్త్ డే రోజు పార్టీకి హాజరు కాలేకపోయిన రాజకీయ ప్రముఖుల కోసం కృష్ణంరాజు మరో ప్రత్యేకమైన పార్టీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కృష్ణంరాజు బిజెపి పార్టీలో ఉన్నారు. దీనితో బిజెపి నేతలు, కేంద్రమంతి కిషన్ రెడ్డి లాంటి ప్రముఖులంతా ఈ పార్టీకి హాజరయ్యారు. 

అనసూయపై ప్రేమ డైలాగులు.. బుద్ది చెప్పిన మహిళలు

కృష్ణంరాజు బర్త్ డే సెలెబ్రేషన్స్ లో వైసిపి ఎంపిక రఘురామ కృష్ణంరాజు కూడా హాజరు కావడం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. బర్త్ డే పార్టీలో రఘురామ కృష్ణంరాజు ప్రత్యేకంగా ప్రభాస్, కృష్ణంరాజుని కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కృష్ణంరాజు బర్త్ డే పార్టీకి ఆహ్వానం అందడంతోనే ఆయన వెళ్లారని.. ఇందులో రాజకీయ కోణం లేదని కొందరు అంటున్నారు. చాలా కాలంగా రఘురామ కృష్ణంరాజు బిజెపి నేతలతో టచ్ లో ఉన్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.