రణవీర్ సింగ్ బాలీవుడ్ లో తక్కువ సమయంలోనే విలక్షణ నటుడిగా మారిపోయాడు. రణవీర్ సింగ్ వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రణవీర్ సింగ్ నటిస్తున్న వైవిధ్యభరితమైన చిత్రం జయేష్ భాయ్ జోర్దార్. మహిళలకోసం పోరాడే యువకుడిగా ఈ చిత్రంలో రణవీర్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ పాత్ర చాలా ఫన్నీగా ఉండబోతోంది.

యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే హీరోయిన్ గా నటిస్తోంది. అర్జున్ రెడ్డి తర్వాత షాలిని పాండేకు ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రాలేదనే చెప్పాలి. కానీ రణ్వీర్ లాంటి బాలీవుడ్ స్టార్ సరసన షాలిని నటిస్తుండడం ఆమెకు దక్కిన మంచి ఆఫర్. 

తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ని యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ప్రకటించింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఫరాన్ అక్తర్ నటిస్తున్న తుఫాన్,  జయేష్ భాయ్ జోర్దార్ చిత్రాలు ఒకే రోజున రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. 

కొరటాల, చిరంజీవికి బిగ్ షాక్.. తప్పుకుంటున్నట్లు ప్రకటించిన త్రిష

కానీ  రెండు చిత్రాల ఓపెనింగ్స్ దెబ్బతినకుండా నిర్మాతలు ఆదిత్య చోప్రా, రితేష్ సిద్వానీ జరిపిన చర్చలు ఫలించాయి. తుఫాన్ చిత్రాన్ని సెప్టెంబర్ 18న రిలీజ్ చేయడానికి అంగీకరించారు. దీనితో రెండు చిత్రాల మధ్య రెండు వారాల గ్యాప్ ఏర్పడింది.